Breaking News

ఎలక్ట్రిక్‌ కారు కొన్న శంకర్‌ మహదేవన్‌.. ధర ఎంతంటే?

Published on Mon, 10/27/2025 - 15:55

సంగీత దిగ్గజం శంకర్‌ మహదేవన్‌ (Shankar Mahadevan) లగ్జరీ కారు కొన్నాడు. ఎంజీ ఎమ్‌ 9 ఎలక్ట్రిక్‌ కారును తన గ్యారేజీకి తీసుకొచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో శంకర్‌ మహదేవన్‌.. కొత్త కారును ఇంటికి తీసుకొచ్చి హారతిచ్చాడు. అనంతరం కారు ముందు దర్జాగా నిలబడి ఫోటోలకు పోజిచ్చాడు.

కారు
ఎంజీ ఎమ్‌9 మోడల్‌లో సీట్‌ మసాజ్‌, డ్యుయెల్‌ సన్‌రూఫ్‌, హీటింగ్‌, వైర్‌లెస్‌ చార్జింగ్‌ వంటి అనేక సదుపాయాలున్నాయి. సౌండ్‌ సిస్టమ్‌ కూడా అదిరిపోతుంది. కేవలం 30 నిమిషాల్లోనే దాదాపు 80 శాతం చార్జ్‌ అవుతుంది. ఒక్కసారి చార్జ్‌ చేస్తే 548 కి.మీ ‍ప్రయాణించవచ్చు. ఈ కారు ధర రూ.80 లక్షల పైనే ఉంటుందని తెలుస్తోంది.

సింగర్‌గా, సంగీత దర్శకుడిగా..
శంకర్‌ మహదేవన్‌ 1967లో జన్మించాడు. బాల్యంలోనే హిందూస్థానీ శాస్త్రీయ సంగీతం, కర్ణాటక సంగీతం నేర్చుకున్నాడు. చదువు పూర్తవగానే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేశాడు. కొంతకాలానికి ఉద్యోగానికి రాజీనామా చేసి సంగీత ప్రపంచంలో అడుగుపెట్టాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠి, తుళు, పంజాబీ, హిందీ భాషల్లో అనేక పాటలు ఆలపించాడు. ఉ‍ట్టిమీద కూడు, ఏమి చేయమందువే.., ఒకటే జననం ఒకటే మరణం.., స్నేహమంటే ఇదేరా, ఓం మహాప్రాణ దీపం.., భం భం బోలే.., చంద్రుల్లో ఉండే కుందేలు.. అఖండ టైటిల్‌ సాంగ్‌ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన పాడిన పాటలు చాలానే ఉన్నాయి. అలాగే ఎన్నో సినిమాలకు ఆయన మ్యూజిక్‌ కూడా అందించాడు.

 

 

చదవండి: కల్యాణ్‌ను పొడిచేసిన శ్రీజ.. నామినేషన్స్‌లో ఎవరున్నారంటే?

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)