Breaking News

పెళ్లికి సరికొత్త నిర్వచనం చెప్పిన బాలీవుడ్‌ హీరోపై ట్రోలింగ్‌

Published on Wed, 06/07/2023 - 12:43

పెళ్లంటే రెండు మనసుల కలయిక.. నూరేళ్లు జంటగా జీవించేందుకు ముందడుగు.. ఇలా బోలెడు కబుర్లు చెప్తారు. కానీ బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ మాత్రం పెళ్లికి సరికొత్త అర్థం చెప్పాడు. అబ్బాయిని సరైన దారిలో పెట్టేందుకు ఓ అమ్మాయి అతడి జీవితంలోకి రావడమే వివాహం అని పేర్కొన్నాడు. ఇది విన్న ఫ్యాన్స్‌ తల పట్టుకుంటున్నారు.

షాహిద్‌ కపూర్‌ ప్రస్తుతం బ్లడీ డాడీ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. 'ఈ వివాహం అనేది ఒకే ఒకదానిపై ఆధారపడి ఉంటుంది. అదేంటంటే.. జీవితంపై ఓ క్లారిటీ లేని అబ్బాయి లైఫ్‌లోకి అమ్మాయి వచ్చి అతడి సమస్యలను పరిష్కరించి, తనను ఓ దారిలో పెట్టడమే పెళ్లి. ఆ అమ్మాయి వల్లే అతడు బాధ్యత గల వ్యక్తిగా మారతాడు' అని కొత్త నిర్వచనం ఇచ్చాడు. ఈ వ్యాఖ్యలు కొందరికి అస్సలు మింగుడుపడటం లేదు. 

'ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగడం పెళ్లి కాదా? ఒకరినొకరు సరిదిద్దుకోవడమే పెళ్లా? ఇదెక్కడి విచిత్రం?' అని కామెంట్లు చేస్తున్నారు. 'ఏంటి బాబూ మరోసారి చెప్పు.. అంటే మీ అమ్మ అదే పని చేసిందా? నిన్ను సరిగా పెంచిందా? లేదా? మీకింకా బుర్ర ఎదగలేదు. ఆడవాళ్లు అంటే మిమ్మల్ని పెంచుతూ, మిమ్మల్ని బాగు చేసే నర్సులు అనుకుంటున్నారా?', 'నువ్వు కబీర్‌ సింగ్‌(అర్జున్‌ రెడ్డి రీమేక్‌)లో నటించావు, మాకు ఆ విషయం తెలుసు, కానీ నువ్వు ఇంకా ఆ పాత్రలో నుంచి బయటపడలేదా?' అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: ప్రియుడితో నటి బ్రేకప్‌.. ఓదార్చిన వ్యక్తితో పెళ్లికి రెడీ

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)