Breaking News

నయనతార అందగత్తె, స్వీట్‌ పర్సన్‌ : షారుక్‌ ఖాన్‌

Published on Tue, 05/09/2023 - 09:38

నయనతార అందమైన నటి. ఈ మాట అన్నది ఎవరో కాదు బాలీవుడ్‌ బాద్షా షారుక్‌ ఖాన్‌. పఠాన్‌ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లను కొల్లగొట్టిన ఈయన తాజాగా జవాన్‌ చిత్రంతో తెరపైకి రావడానికి ముస్తాబ్‌ అవుతున్నారు. రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో నయనతార నాయికగా నటించగా నటుడు విజయ్‌ సేతుపతి తదితరులు ముఖ్యపాత్ర పోషించారు. కోలీవుడ్‌ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. చదవండి: విజయ్‌ దేవరకొండ స్టైల్‌లో 'మేమ్‌ ఫేమస్‌' రిలీజ్‌ డేట్‌

ఈ సందర్భంగా షారుక్‌ ఖాన్‌ జవాన్‌ చిత్ర విడుదల తేదీని సోమవారం అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఆయన ఆన్‌లైన్‌ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా అభిమానుల ప్రశ్నలకు బదులిస్తూ జవాన్‌ పక్క కమర్షియల్‌ అంచాలతో కూడిన యాక్షన్‌ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. నటి నయనతారతో కలిసి ఈ చిత్రంలో నటించడం చాలా సంతోషమని పేర్కొన్నారు.

ఆమె చాలా అందగత్తె అనీ, స్వీటీ అని పేర్కొన్నారు. నటుడు విజయశాంతి చాలా ప్రతిభావంతుడని, చాలా ఒదిగి ఉండే నటుడు అనీ, ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను అని అన్నారు. నటుడు అఖిల్‌ గురించి చెప్పాలంటే ఆయన తనను రెండు విధాలుగా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. అట్లీ సంగీత దర్శకుడు కలిసి తనను ఈ చిత్రంలోని పాటల్లో కొన్ని పదాలను పాడించారని చెప్పారు. చదవండి: ఆ బాలీవుడ్‌ హీరోతో పూజాహెగ్డే రొమాన్స్‌

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)