Breaking News

ఇండియన్‌ రిచ్చెస్ట్‌ హీరో 'షారుఖ్‌ ఖాన్‌' ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

Published on Sat, 11/02/2024 - 18:55

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్. ఇండియన్‌ రిచ్చెస్ట్‌ సినీ నటుడు ఎవరని అడిగితే వెంటనే షారుఖ్‌ పేరే చెబుతారు. 1965లో ఢిల్లీలో తాజ్ మొహమ్మద్ ఖాన్‌, లతీఫ్ ఫాతిమా దంపతులకు ఆయన జన్మించారు. మొదట ఆయన సిరీయల్స్‌తోనే కెరియర్‌ ప్రారంభించి ఆపై వెండితెరపైన తన సత్తా ఏంటో చూపించాడు. ఒక సాదారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన షారుక్‌ బాలీవుడ్ బాద్‌షా అవడమే కాకుండా కోట్ల రూపాయలు సంపాదించారు. ఇండియాలోమ రిచ్చెస్ట్‌ హీరోగా షారుఖ్‌ ఉన్నారు.

ఇండియాలోనే రిచ్చెస్ట్‌ హీరో
షారుఖ్ ఖాన్ ఆస్తులు విలువ సుమారు రూ. 7300 కోట్లకు పైమాటే అని చెప్పవచ్చు. సినిమా,వ్యాపార ప్రకటనలు,ఐపీఎల్‌ వంటి వాటిపై ఆయన భారీగానే సంపాదిస్తున్నారు. అలా ఏడాదికి రూ 300 కోట్ల వరకు షారుఖ్‌ అర్జిస్తున్నట్లు సమాచారం. ఒక్కో సినిమా కోసం రూ 120 నుంచి 150 కోట్ల వరకు రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నట్లు టాక్‌ ఉంది. తన సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌ ఉండటంతో ఆయన అడిగినంత డబ్బు ఇచ్చేందుకు నిర్మాతలు రెడీగా ఉంటారు. కానీ ఆయన ఈ మధ్య ఎక్కువ సినిమాలు తన రెడ్‌ చిల్లీస్‌ సంస్థ ద్వారా తన భార్య గౌరీ ఖాన్‌ నిర్మిస్తుండటం విశేషం. తన సంపాదనలో ఎక్కువగా పేద పిల్లలకు విద్యను అందించడానికి అతని స్వచ్ఛంద సంస్థ ద్వారా సాయం అందిస్తున్నాడు.

18 ఏళ్ల వయసులోనే ప్రేమ.. హిందూ సాంప్రదాయంలో పెళ్లి
షారుక్‌ సినిమాల్లోకి రాకముందే గౌరీ ఖాన్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. పంజాబీ హిందువు అయిన గౌరీ చిబ్బర్‌ను 1991లో సాంప్రదాయ హిందూ వివాహ పద్ధతిలో ఆయన పెళ్లి చేసుకున్నారు. పలు సందర్భాల్లో షారుక్‌ తమ ప్రేమకథను పంచుకున్నారు. 

షారుక్‌ 18 ఏళ్ల వయసులో ఓ పార్టీలో గౌరీని చూశారు. తొలిచూపులోనే ఆమెను ప్రేమించారు. అప్పుడు గౌరీ వయసు 14 ఏళ్లట. ఆపై షారుక్‌ గౌరీ ఫోన్‌ నెంబర్‌ తెలుసుకుని.. ఫోన్లు చేసేవారట. అలా వారి మనసులు కలిసి, ఆ పరిచయం ప్రేమగా మారింది. అలా 1991 అక్టోబరు 25న వీరు వివాహం చేసుకున్నారు. వారికి  ఒక కుమారుడు ఆర్యన్ (జననం 1997), ఒక కుమార్తె సుహానా (జననం 2000) 2013లో వారు మూడవ బిడ్డకు తల్లిదండ్రులు అయ్యారు, అబ్రామ్ అనే కుమారుడు అద్దె తల్లి ద్వారా జన్మించాడు.

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు