Breaking News

పదేళ్ల వ్యవధిలో తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయా..: షారూఖ్‌

Published on Wed, 11/20/2024 - 17:23

చిన్న వయసులో తల్లిదండ్రులను పోగొట్టుకోవడాన్ని మించిన బాధ మరొకటి లేదంటున్నాడు హీరో షారూఖ్‌ ఖాన్‌. ద గ్లోబల్‌ ఫ్రెయిట్‌ సమ్మిట్‌ వేదికలో పాల్గొన్న ఆయన తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు. నా చిన్నతనంలోనే అమ్మానాన్న మరణించారు. నాన్న 14 ఏళ్ల వయసులో, అమ్మ 24 ఏళ్ల వయసులో చనిపోయారు. పదేళ్ల వ్యవధిలోనే ఇద్దర్నీ కోల్పోయాను. ఎక్కడికెళ్లాలో తెలియలేదు. 

పేరెంట్స్‌ కోసం కష్టపడ్డా..
నాతో పాటు అక్క కూడా ఉంది. మా ఇద్దరినీ ఈ ప్రపంచంలో వదిలేసి పోయారు. ఆకాశంలోని నక్షత్రాల్లో కలిసిపోయారు. ఎప్పటికైనా ఆ నక్షత్రాల్ని అందుకోవాలనుకునేవాడిని. బహుశా అక్కడ కూడా వాళ్లు మా గురించి కంగారుపడేవారేమో! అందుకనే జీవితంలో సక్సెస్‌ అవ్వాలని చాలా కష్టపడ్డాను. ఎక్కడున్నా నా పేరెంట్స్‌ బాధపడకూడదని ప్రయత్నించాను. చివరకు అనుకున్నది సాధించాను. 

గిల్టీగా ఫీల్‌ అయ్యేవాడిని
వాళ్లకన్నా ముందు నేను చనిపోయుంటే చాలా గిల్టీగా ఫీల్‌ అయ్యేవాడిని. ఎందుకంటే నేను తిరిగి రాలేనన్న బాధలో నుంచి వారు బయటపడేవారు కాదు అని చెప్పుకొచ్చాడు. కాగా షారూఖ్‌ చివరగా డంకీ సినిమాలో నటించాడు. ప్రస్తుతం కింగ్‌ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి షారూఖ్‌ కూతురు సుహానా ఖాన్‌తో పాటు సుజయ్‌ ఘోష్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)