Breaking News

వెయ్యి కోట్ల క్లబ్బులో పఠాన్‌.. ఖరీదైన రోల్స్‌ రాయిస్‌ కారు కొన్న షారుక్‌

Published on Mon, 03/27/2023 - 16:14

బాలీవుడ్‌ పనైపోయింది అని విరగబడి నవ్వినవాళ్లకు పఠాన్‌తో సమాధానం చెప్పాడు షారుక్‌ ఖాన్‌. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత పఠాన్‌తో కమ్‌బ్యాక్‌ ఇచ్చిన షారుక్‌ ముప్పైకి పైగా రికార్డులను బద్ధలు కొట్టాడు. పఠాన్‌ రిలీజై 50 రోజులకు పైనే అవుతున్నా ఇప్పటికీ థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1049.50 కోట్ల గ్రాస్‌ రాబట్టిందీ చిత్రం. ఇందులో ఇండియా వాటా రూ.657.25 కోట్లు కాగా ఓవర్సీస్‌ది రూ.392.35 కోట్లుగా ఉంది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.

వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిన షారుక్‌ తాజాగా ఓ ఖరీదైన కారు కొనుగోలు చేసిశాడు. రోల్స్‌ రాయిస్‌ క్యులినన్‌ బ్లాక్‌ బెడ్జ్‌.. ఎస్‌యూవీ కారును తన గ్యారేజీకి తెచ్చుకున్నాడు. దీని ధర దాదాపు రూ.10 కోట్లు ఉండవచ్చని అంచనా! భారత్‌లో అమ్ముడవుతున్న ఖరీదైన ఎస్‌యూవీ కార్లలో ఇది ఒకటి అని తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం షారుక్‌ తన కొత్త కారులో షికారుకు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గత నెలలో రూ.5 కోట్లు విలువ చేసే వాచీ చేతికి ధరించి స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచాడీ బాలీవుడ్‌ స్టార్‌.

ప్రస్తుతం షారుక్‌ ఖాన్‌.. అట్లీ దర్శకత్వంలో 'జవాన్‌', రాజ్‌కుమార్‌ హిరానీ డైరెక్షన్‌లో 'డుంకీ' చిత్రాల్లో నటిస్తున్నాడు. సల్మాన్‌ ఖాన్‌ 'టైగర్‌ 3' మూవీలో ఓ ముఖ్య పాత్ర పోషించనున్నట్లు భోగట్టా!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)