Breaking News

గాయపడిన షారుఖ్ ఖాన్‌.. అమెరికాకు ప్రయాణం!

Published on Sat, 07/19/2025 - 12:47

బాలీవుడ్ ప్రముఖ నటుడు షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) గాయపడ్డారని తెలుస్తోంది. తను నటిస్తున్న కొత్త సినిమా 'కింగ్‌' షూటింగ్లో ఆయన ప్రమాదానికి గురైనట్లు బాలీవుడ్మీడియాలో వార్తలు వస్తున్నాయి. ముంబైలోని గోల్డెన్ టొబాకో స్టూడియోలో కింగ్సినిమా షూటింగ్జరుగుతుంది. అందులో కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసం అతిపెద్ద సెట్వేశారు. యాక్షన్సీన్చిత్రీకరణలో భాగంగానే షారుఖ్ గాయపడ్డారని చెబుతున్నారు

అయతే, గాయం గురించి ఖచ్చితమైన వివరాలను అధికారికంగా వెళ్లడించలేదు. కానీ, షారుఖ్ తన టీమ్తో కలిసి అత్యవసర వైద్య సహాయం కోసం అమెరికాకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన కండరాలకు తీవ్రంగా గాయం అయినట్లు సమాచారం. అయతే, అభిమానులు పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదని బాలీవుడ్మీడియా పేర్కొంది. షారుఖ్ గతంలోనే కండరాల సమస్యతో ఇబ్బంది పడ్డారు. అందుకోసం చికిత్స కూడా తీసుకున్నారు.

2023లో పఠాన్‌, జవాన్‌, డంకీ చిత్రాలతో షారుఖ్ ఖాన్ హ్యాట్రిక్‌ విజయాలను సొంతం చేసుకున్నారు. 2024లో సినిమాలకు కాస్త బ్రేక్ఇచ్చారు. అయితే, 'కింగ్‌' సినిమా ప్రకటించి ఆయన మళ్లీ బిజీ అయ్యారు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో చిత్రం రానుంది. గతంలో వారిద్దరూ పఠాన్‌తో భారీ విజయాన్ని అందుకున్నారు. ఇందులో షారుక్‌ ఖాన్‌ కుమార్తె సుహానా ఖాన్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు.దీపికా పదుకొణె, రాణి ముఖర్జీ, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)