Breaking News

షారుక్‌ ఖాన్‌కు బెదిరింపులు.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు!

Published on Mon, 10/09/2023 - 11:23

బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్‌కు బెదిరింపుల నేపథ్యంలో మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన కుటుంబానికి వై ప్లస్ భద్రత కల్పించనున్నట్లు వెల్లడించింది. ఇటీవల షారుక్‌ను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు లేఖలు పంపారు. దీంతో షారుక్ ముంబయి పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో షారుక్ ఫ్యామిలీకి వై ప్లస్ భద్రత కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

(ఇది చదవండి: 'గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అన్నాడు'.. బాలయ్య కామెంట్స్ వైరల్!)

పఠాన్ సాంగ్ వివాదం

గతంలో రిలీజైన పఠాన్ ‘బేషరమ్ రంగ్’ పాటపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని పాటకు దీపికా పదుకొణె కుంకుమపువ్వు బికినీ ధరించడంపై కొన్ని వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అప్పట్లో చాలా బెదిరింపులు కూడా వచ్చాయి.  ఈ నేపథ్యంలో షారుక్ ఖాన్ ఫ్యామిలీకి వీఐపీ భద్రతా విభాగానికి చెందిన ఆరుగురు శిక్షణ పొందిన కమాండోలతో రక్షణ కల్పిస్తారు. ఇప్పటికే ఆయన ఇంట్లో నలుగురు సాయుధ పోలీసు అధికారులు ఉన్నారు. తాజాగా మళ్లీ బెదిరింపులు రావడంతో భద్రత స్థాయిని పెంచింది. 

గతంలో చాలామంది బాలీవుడ్ ప్రముఖులకు భద్రత కల్పించారు. బాలీవుడ్ ప్రముఖులైన అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్‌లకు భద్రతను పెంచారు. కాగా.. ఇటీవలే షారుక్ నటించిన జవాన్ చిత్రం రిలీజైన బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. బాలీవుడ్‌లో అత్యధికంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. 

(ఇది చదవండి: 'నా ఎలిమినేషన్‌కు కారణం అతనే'.. శుభశ్రీ కామెంట్స్ వైరల్!)

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)