Breaking News

కేకేఆర్‌ గెలుపు.. గాల్లో తేలిపోయిన షారూఖ్‌.. చూసుకోకుండా..!

Published on Wed, 05/22/2024 - 12:48

ఐపీఎల్‌ టోర్నీలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) నేరుగా ఫైనల్‌కు అర్హత సంపాదించింది. మంగళవారం జరిగిన ఫస్ట్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను చిత్తుగా ఓడించింది. కేకేఆర్‌ విజయంతో ఆ టీమ్‌సభ్యులు, అభిమానులు విజయానందంలో మునిగిపోయారు. తన టీమ్‌ సక్సెస్‌ను కళ్లారా చూసిన బాలీవుడ్‌ స్టార్‌ షారూఖ్‌ ఖాన్‌ ఆనందానికైతే అవధుల్లేకుండా పోయాయి. 

వెంటనే అలర్ట్‌ అయి..
మ్యాచ్‌ అనంతరం వెంటనే మైదానంలోకి వెళ్లి అభిమానులందరికీ అభివాదం చేసుకుంటూ ముందుకు నడిచాడు. అయితే అక్కడ మాజీ క్రికెటర్లు ఆకాశ్‌ చోప్రా, పార్థీవ్‌ పటేల్‌, సురేశ్‌ రైనా జరిగిన మ్యాచ్‌ గురించి లైవ్‌లో మాట్లాడుతూ ఉన్నారు. వారిని చూసుకోకుండా తన భార్య, కుమారుడితో ఎంతో హుషారుగా ముందుకు నడిచాడు షారూఖ్‌. వెంటనే అక్కడ లైవ్‌ ఎపిసోడ్‌ జరుగుతుందని గమనించి వాళ్లకు రెండు చేతులు జోడించి సారీ చెప్పి హగ్‌ ఇచ్చి వెళ్లిపోయాడు. ఇది చూసిన ఫ్యాన్స్‌ తమ అభిమాన హీరో అంత ఖుషీగా ఉండటం చూసి మురిసిపోతున్నారు.

షారూఖ్‌ సినిమాల విషయానికి వస్తే.. 
కొన్నేళ్లుగా సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన షారూఖ్‌ గతేడాది ఫుల్‌ ఫామ్‌లోకి వచ్చాడు. పఠాన్‌, జవాన్‌, డంకీ చిత్రాలతో బాక్సాఫీస్‌పై కలెక్షన్ల వర్షం కురిపించాడు. ప్రస్తుతం ఐపీఎల్‌ మేనియాలో ఉన్న ఈ హీరో సినిమాలకు చిన్న గ్యాప్‌ ఇచ్చాడు. తన టీమ్‌ కేకేఆర్‌ ఆడే అన్ని మ్యాచులకు హాజరవుతానని మాటిచ్చిన షారూఖ్‌ దాన్ని నిలబెట్టుకునే పనిలో ఉన్నాడు. జూలై లేదా ఆగస్టులో అతడి కొత్త ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి.

 

 

చదవండి: తొలిసారి ఆ ఇండస్ట్రీలోకి కియారా.. స్టార్ హీరోతో కలిసి?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)