Breaking News

రూ.50 లక్షలు నష్టపోయా.. ఆస్తులమ్మేశా: బుల్లితెర నటి

Published on Thu, 04/11/2024 - 18:25

ఒకప్పుడు సీరియల్స్‌లో రఫ్ఫాడించింది నటి, నిర్మాత యాట నవీన. ఇప్పుడు సోషల్‌ మీడియాలో తన ఇద్దరు కుమారులతో కలిసి రీల్స్‌, వీడియోలు చేస్తూ హడావుడి చేస్తోంది. ఆమె భర్త యాట సత్యనారాయణ దర్శకుడిగా రాణిస్తున్నాడు. ఇటీవలే రజాకార్‌ సినిమాకు దర్శకత్వం వహించాడు.

అమ్మ ఎంతో కష్టపడింది
తాజాగా నవీన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. 'నా చిన్నప్పటినుంచి అమ్మ ఎన్నో కష్టాలు పడింది. చీరలమ్ముతూ, మిషన్‌ కుడుతూ పోషించింది. నేను షూటింగ్స్‌కు వెళ్తే నా పిల్లల్ని మా అమ్మే చూసుకుంది. నిజానికి నేను యాక్టింగ్‌ ఫీల్డ్‌లోకి ఇష్టంగా రాలేదు. పరిస్థితుల వల్ల డబ్బు కోసం సినిమాల్లోకి వచ్చాను. అప్పట్లో సినిమా ఛాన్సులు రావాలంటే ఫోటోషూట్‌ చేయించుకుని అవి పట్టుకునే తిరిగేవాళ్లం. దానికోసం మా అమ్మ తనదగ్గరున్న ఒకే ఒక బంగారు నగను అమ్మేసి నన్ను ఫోటోలు తీయించింది.

అరిస్తే ఏడ్చేశా
వీరివీరి గుమ్మడిపండు, కాదంటే ఔననిలే.. సినిమాల్లో హీరోయిన్‌గా చేశాను. ఇంకో రెండు సినిమాల్లో కథానాయికగా చేశాను కానీ రిలీజ్‌ కాలేదు. త్రిశూలం సీరియల్‌ చేస్తున్నప్పుడు.. నాకు యాక్టింగ్‌ సరిగా రావడం లేదని డైరెక్టర్‌ సత్యనారాయణ సెట్స్‌లో అరిచేశాడు. ఏడ్చి వెళ్లిపోయాను. అలా మా మధ్య పరిచయం ఏర్పడింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం.

కిలో బంగారం..
నాకు బంగారం అంటే చాలా ఇష్టం. కిలో బంగారం ఉండాలని టార్గెట్‌ పెట్టుకున్నాను. ఇప్పటికే కిలోదాకా గోల్డ్‌ జమ చేశాను. ఒకసారి మేము పీకల్లోతు కష్టాల్లోకి వెళ్లిపోయాము. ఓ సీరియల్‌ తీసేందుకు రూ.70 లక్షల దాకా ఖర్చు చేశాం. అగ్రిమెంట్స్‌ దగ్గర తేడా రావడంతో వంద ఎపిసోడ్లకే ఆ సీరియల్‌ ఆపేశారు. రూ.20 లక్షలు కూడా వెనక్కు రాలేదు. రూ.50 లక్షలు నష్టం రావడంతో మా దగ్గరున్న భూమి అమ్మేసి అప్పులు తీర్చేశాం. మళ్లీ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి వచ్చాం' అని పేర్కొంది.

చదవండి: ఆ షో వల్లే అంతా తలకిందులు.. విడాకులు.. మానసికంగా దెబ్బతిన్నా!

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)