Breaking News

తొమ్మిదవ నెల గర్భంతో లహరి, సీమంతం ఫోటోలు వైరల్‌

Published on Sun, 07/30/2023 - 10:51

సీరియల్స్‌తో బాగా ఫేమస్‌ అయిన నటి లహరి. మొగలి రేకులు నుంచి గృహలక్ష్మి వరకు పలు సీరియల్స్‌లో భిన్నరకాల పాత్రలు చేస్తూ మెప్పిస్తూ వస్తోంది. అయితే ఇటీవల నటనకు కాస్త గ్యాప్‌ ఇచ్చింది లహరి. తను గర్భం దాల్చడం వల్లే యాక్టింగ్‌కు విరామం పలికింది.

గత నెలలో లహరి సీమంతం వేడుకను ఇంటిసభ్యులు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సీమంతానికి బుల్లితెర తారలు హాజరై కాబోయే తల్లిని మనసారా ఆశీర్వదించారు. ప్రస్తుతం లహరికి తొమ్మిదవ నెల కావడంతో స్నేహితులంతా కలిసి మరోసారి సీమంతం ఫంక్షన్‌ చేశారు. ఈ వేడుకలో లహరి ఎల్లో డ్రెస్‌లో మెరిసిపోయింది. దీనిపై రెడ్‌ కోట్‌ ధరించింది. ఆమె భర్త లహరికి మ్యాచ్‌ అయ్యేలా రెడ్‌ జాకెట్‌ ఉన్న బ్లూ డ్రెస్‌ ధరించాడు. ప్రస్తుతం లహరి సీమంతం ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇకపోతే ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన ఫోటోలను, వీడియోలను  లహరి ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటోంది. పుట్టబోయే బిడ్డ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకుంది. దుస్తులు, బ్యాగులు, బెడ్‌.. ఇలా అన్నింటినీ ముందుగానే సమకూర్చుకుంది. వీటికి సంబంధించిన వీడియోలను సైతం తన యూట్యూబ్‌ ఛానల్‌లో రిలీజ్‌ చేసింది. మరికొద్ది రోజుల్లో డెలివరీ ఉండటంతో లహరికి అభిమానులు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

చదవండి: ప్రియుడి కోసం పేరు మార్చుకున్న నటి, పెళ్లయిపోయిందా?

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)