Breaking News

'ఆ విషయంలో కాస్త ఓపిక పట్టండి'.. ఫ్యాన్స్‌కు సీరియల్ బ్యూటీ రిక్వెస్ట్!

Published on Sun, 02/04/2024 - 15:15

'గుప్పెడంత మనసు' సీరియల్‌తో టాలీవుడ్ ప్రేక్షకులను ‍అలరించిన భామ జ్యోతిరాజ్. ఈ సీరియల్‌లో జగతి మేడమ్ పాత్రతో ఫేమ్ తెచ్చుకుంది. కన్నడకు చెందిన ఈ బ్యూటీ 'బందె బరాటవ కాలా' సీరియల్‌‌తో నటిగా కెరీర్ ప్రారంభించింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళంలోనూ బుల్లితెరపై మెరిసింది. అయితే భర్తతో విడాకులు తీసుకున్న ముద్దుగుమ్మ యంగ్ డైరెక్టర్‌ పూర్వజ్‌తో పీకల్లోతు ప్రేమలో ఉంది. అంతే కాదు జ్యోతిరాయ్‌ పేరును కాస్తా జ్యోతి పూర్వాజ్‌గా మార్చేసింది. 

కాగా.. జ్యోతిరాయ్  ప్రస్తుతం ప్రెట్టీ గర్ల్‌ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సిరీస్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్న భామ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన పోస్టర్‌ను తన ఇన్‌స్టాలో పంచుకుంది. ఈ పోస్టర్‌లో మరింత బోల్డ్ లుక్‌తో కనిపించింది. ఇప్పటికే హాట్‌ పెంచేసిన సీరియల్ బ్యూటీ కాస్తా ఇప్పుడు మరింత బోల్డ్‌గా కనిపించడంతో ఫ్యాన్స్‌ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

జ్యోతి తన ఇన్‌స్టాలో రాస్తూ..'అతి త్వరలో భయంకరమైన, విచిత్రమైన, కఠినమైన, గ్లామర్ డోస్ బ్లడ్ బాత్ థ్రిల్లర్‌తో వస్తున్నా. ప్రస్తుతం ఈ సిరీస్‌ షూటింగ్ జరుగుతోంది. ఇంకా 3 షెడ్యూల్స్ మిగిలి ఉన్నాయి. త్వరలోనే ఈ సిరీస్ గ్లింప్స్ రిలీజ్ చేస్తాం. దయచేసి ఆ విషయంలో ఓపిక పట్టండి. ఈ అద్భుతమైన మల్టీ క్యారెక్టరైజేషన్ ఇచ్చిన నా టీమ్‌కి ధన్యవాదాలు. నన్ను నేను డిఫరెంట్‌గా చూపించుకోవడాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్నా. మీరు త్వరలోనే దీన్ని ఇష్టపడతారని ఆశిస్తున్నా.'  అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్టర్ చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)