Breaking News

శామీర్‌పేట్‌ ఘటన: కాల్పులు జరిపింది తాను కాదన్న సీరియల్‌ నటుడు

Published on Sat, 07/15/2023 - 17:56

శామీర్‌పేట్‌ కాల్పుల ఘటనలో ఊహించని ట్విస్ట్‌ చోటు చేసుకుంది. సిద్దార్థ్‌పై నటుడు మనోజ్‌ కాల్పులు జరిపాడంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఘటనతో తనకెలాంటి సంబంధం లేదంటూ వీడియో రిలీజ్‌ చేశాడు నటుడు మనోజ్‌. గన్‌ ఫైర్‌ కేసుతో తనకు సంబంధం లేదని, ప్రస్తుతం తాను బెంగళూరులో ఉన్నానని వెల్లడించాడు.

శామీర్‌పేట్‌ సెలబ్రిటీ రిసార్ట్‌లో కాల్పులు జరిపిన మనోజ్‌ నాయుడు తాను కాదని స్పష్టం చేశాడు. కొంతమంది తన ఫోటోలు, వీడియోలు వాడుతూ అసత్య ప్రచారం చేస్తున్నారని, ఈ తప్పుడు వార్తలను నమ్మవద్దని కోరాడు. నిజానిజాలు తెలుసుకోకుండా తనపై అసత్య ప్రచారం చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని తెలిపాడు.

అనవసరంగా తనపై చేయని నేరాన్ని మోపుతున్నారంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఆవేదన వ్యక్తం చేశాడు మనోజ్‌. 'ఈరోజు ఉదయం నుంచి నాపై అసత్య వార్తను ప్రచారం చేస్తున్నారు. మనోజ్‌ అనే ఓ వ్యక్తి గన్‌ ఫైర్‌ చేసినందుకు అతడి స్థానంలో నా పేరు, ఫోటోలు వాడుతున్నారు. ఆఖరికి నా సీరియల్‌ క్లిప్పింగ్స్‌ కూడా వాడుతున్నారు. ముందూవెనకా తెలుసుకోకుండా ఇలా ఎలా చేస్తారు? రెండు రోజులుగా నేను బెంగళూరులో ఉన్నాను. హైదరాబాద్‌లో ఏం జరుగుతుందనేది కూడా నాకు తెలియదు. నా గురించి అసత్య ప్రచారం చేసి నా పరువుకు భంగం కలిగించారు. ఇది నా జీవితం, కెరీర్‌పై ఎంతగానో దుష్ప్రభావం చూపుతుంది. దీనిపై త్వరలో పోలీసులకు ఫిర్యాదు చేస్తాను' అని చెప్పుకొచ్చాడు.

అసలేం జరిగిందంటే..
శామీర్‌పేట్ సెలబ్రిటీ రిసార్ట్‌లోని విల్లాలో సిద్ధార్థ దాస్‌పై కాల్పులు జరిగాయి. మూడేళ్లుగా సిద్ధార్ధ్‌దాస్‌ భార్యతో మనోజ్ సహజీవనం చేస్తున్నాడు. 2019లో భర్త సిద్ధార్ధ్‌ దాస్‌తో విడిపోయిన స్మిత విడాకుల కోసం కూకట్‌పల్లి కోర్టులో దరఖాస్తు చేసింది. దాంతో పాటు తాను నివాసం ఉంటున్న వైపు భర్త రాకుండా ఇంజక్షన్ ఆర్డర్‌ కూడా స్మిత తెచ్చుకుంది. మనోజ్‌తో కలిసి ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీని ఏర్పాటు చేసిన స్మిత.. సెలబ్రిటీ రిసార్ట్స్‌లోని తాముంటున్న ఇంట్లోనే ఆఫీస్ ఏర్పాటు చేశారు. పిల్లలతో పాటు స్మిత, మనోజ్ కలిసి అక్కడే నివాసం ఉంటున్నారు.

ఇటీవల మనోజ్‌.. స్మిత కుమారుడు 17 ఏళ్ల బాలుడిని కొట్టాడు. ఈ విషయాన్ని బాలుడు తన తండ్రి సిద్దార్థ్‌కు చెప్పాడు. తన చెల్లెలిని కూడా వేధిస్తున్నారని పేర్కొన్నాడు. దీంతో పాపను తీసుకెళ్లడానికి ఈ రోజు(శనివారం) ఉదయం సిద్ధార్థ్‌ దాస్ విల్లాకు చేరుకున్నాడు. సిద్ధార్థ్‌ వెంట పాపని పంపడం ఇష్టం లేక స్మిత అతడితో గొడవకు దిగింది. దీంతో ముగ్గురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం మనోజ్ ఎయిర్ గన్ తీసుకొని కాల్పులు జరిపాడు. సిద్ధార్థ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

చదవండి: శామీర్‌పేట్‌ ఘటన.. అందమైన అమ్మాయిలకు ట్రాప్‌
ఛీ.. అంత నల్లగానా.. హీరోయిన్‌ను అందరిముందే అవమానించిన స్టార్‌ హీరో

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)