Breaking News

తెలుగు ఇండ‌స్ట్రీలో బ్యాన్‌.. భార్య‌తో క‌లిసి గుడ్‌న్యూస్ చెప్పిన హీరో

Published on Mon, 05/06/2024 - 15:11

ఈ మ‌ధ్య సీరియ‌ల్ యాక్టర్స్‌ వరుస శుభ‌వార్త‌లు చెప్తున్నారు. బుల్లితెర‌ న‌టి మ‌హేశ్వ‌రి పండంటి బాబుకు జ‌న్మ‌నివ్వ‌గా లేడీ విల‌న్‌ శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. అలాగే బుల్లితెర క‌మెడియ‌న్ కొండ‌మ్మ త్వ‌ర‌లో త‌ల్లి కాబోతోంది. తాజాగా ఈ లిస్టులోకి మ‌రో సెల‌బ్రిటీ క‌పుల్ వ‌చ్చి చేరింది.

తెలుగువారికి సుప‌రిచితుడే!
చంద‌న్ కుమార్‌- క‌విత దంప‌తులు త్వ‌ర‌లోనే పేరెంట్స్‌గా ప్ర‌మోష‌న్ పొంద‌నున్నారు. ఈ మేర‌కు ఓ ఫోటో షేర్‌ చేశారు. ఇది చూసిన అభిమానులు వారికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. చంద‌న్ తెలుగు సీరియ‌ల్స్ చూసేవారికి సుప‌రిచితుడే..! సావిత్ర‌మ్మ‌గారి అబ్బాయి సీరియల్‌తో గుర్తింపు పొందిన చంద‌న్ కుమార్ శ్రీమ‌తి శ్రీనివాస్ ధారావాహిక‌లోనూ ప్ర‌ధాన పాత్ర పోషించాడు.

చంద‌న్‌పై బ్యాన్‌
అయితే ఈ సీరియ‌ల్ సెట్‌లో అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌తో దురుసుగా ప్ర‌వ‌ర్తించాడు. అత‌డి త‌ల్లిని దుర్భాష‌లాడ‌టంతో ఆయ‌న‌ చంద‌న్ చెంప చెళ్లుమ‌నిపించాడు. దీంతో చంద‌న్ తెలుగు బుల్లితెర గురించి దురుసుగా మాట్లాడాడు. ఇందుకుగానూ తెలుగు టీవీ ఫెడ‌రేష‌న్ అత‌డిపై బ్యాన్ విధించింది. అలా ఈ క‌న్న‌డ న‌టుడు తెలుగు ఇండ‌స్ట్రీకి దూర‌మ‌య్యాడు.

ఇటీవ‌లే కొత్త బిజినెస్‌
కాగా చంద‌న్‌- క‌విత ఇటీవ‌లే ఫుడ్ బిజినెస్‌లోకి దిగారు. మండిపేట్ ప్లేట్ ఇడ్లీ కేఫ్ పేరిట వెజిటేరియ‌న్ రెస్టారెంట్ ప్రారంభించారు. క‌న్న‌డ హీరో కిచ్చా సుదీప్ చేతుల మీదుగా ఈ రెస్టారెంట్‌ను ఓపెన్ చేశాడు. చంద‌న్‌ ఇటీవ‌ల జ‌రిగిన సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్‌లో కర్ణాట‌క బుల్డోజ‌ర్స్ టీమ్ త‌ర‌పున ఆడాడు. ఇత‌డు హీరోగా క‌న్న‌డ భాష‌లో ప‌రిణ‌య‌, క‌ట్టె, ల‌వ్‌యూ అలియా, బెంగ‌ళూర్ 560023, ఎర‌డోండ్ల మూరు, ప్రేమ బ‌ర‌హ సినిమాలు చేశాడు.

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)