సెప్టెంబరు నెలలో విడుదల అవుతున్న ఏడు టాప్‌ సినిమాలు ఇవే..!

Published on Sun, 08/27/2023 - 14:32

సెప్టెంబరు నెలలో సినిమా అభిమానులకు పండుగే అని చెప్పవచ్చు.. ఇదే నెలలో 7కు పైగా పెద్ద సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. అంతేకాకుండా మరికొన్ని చిన్న సినిమాలు కూడా ఉన్నాయి.  సెప్టెంబరు 18న వినాయక చవితి పండుగ ఉండటంతో సెప్టెంబరు 15న ఏకంగా మూడు సినిమాలు విడుదల అవుతున్నాయి. 

సెప్టెంబరు 1 'ఖుషి'
విజయ్‌ దేవరకొండ-సమంత  కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'ఖుషి'. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. 2019లో వచ్చిన మజిలీ సినిమా తర్వాత ఖుషి వస్తుండటంతో ఫ్యాన్స్‌ అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీని  నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకొస్తోంది. 

సెప్టెంబర్‌ 7  'జవాన్‌'
కోలీవుడ్‌ డైరెక్టర్‌ అట్లీ, బాలీవుడ్‌ కింగ్‌ షారుక్‌ ఖాన్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'జవాన్‌'. పఠాన్‌ తర్వాత భారీ అంచనాలతో ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో నయనతార,దీపికా పదుకోన్‌ వంటి స్టార్స్‌ ఉన్నారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.  

సెప్టెంబర్‌ 7 'మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి'
యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, అనుష్క జంటగా మహేష్ బాబు. పి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 7న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుందీ చిత్రం.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది.

సెప్టెంబర్ 15 'స్కంద'
రామ్ పోతినేని- శ్రీ లీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన మాస్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'స్కంద'. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్‌ను పక్కా మాస్‌ లుక్‌లో బోయపాటి చూపించాడు. ఇందులోని యాక్షన్‌ సీన్స్‌ ప్రేక్షకులతో ఈలలు వేయించేలా ఉన్నాయి. ఇందులో రామ్‌ రెండు కోణాలు ఉన్న పాత్రలో కనిపించనున్నారు.  పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన 'స్కంద' సెప్టెంబర్ 15న వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సెప్టెంబర్ 15 'చంద్రముఖి 2'
రజనీకాంత్‌ నటించిన చంద్రముఖి సినిమా అప్పట్లో ఒక సంచలన విజయం. ఈ సినిమాకు సీక్వెల్‌గా ఇప్పుడు 'చంద్రముఖి 2' విడుదలకు రెడీగా ఉంది. ఇందులో రాఘవ లారెన్స్‌-కంగనా రనౌత్‌ నటిస్తున్నారు. పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 15న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సెప్టెంబర్ 15 'మార్క్ ఆంథోని'
హీరో విశాల్.. ఇప్పుడు 'మార్క్ ఆంథోని'గా వచ్చేస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్, హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తీసిన ఈ సినిమాలో విశాల్‌కి జోడీగా రీతూవర్మ నటించింది. ఎస్.జె.సూర్య, సునీల్, సెల్వ రాఘవన్ ముఖ్య పాత్రలు పోషించారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఎస్.వినోద్ కుమార్ నిర్మించారు. ఈ సినిమా కూడా సెప్టెంబర్ 15న వినాయక చవితి సందర్భంగా విడుదల కానుంది.

సెప్టెంబర్ 28 'సలార్‌'
ప్రభాస్  హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'సలార్‌' సెప్టెంబర్ 28న విడుదలకు రెడీగా ఉంది. ఇందుకు సంబంధించిన ట్రైలర్‌ను సెప్టెంబర్ 3న విడుదల చేసేందుకు హోంబలే ఫిలిమ్స్‌ ప్లాన్‌ చేస్తుంది.  ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా అదే రోజు నుంచి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌ నెలలో విడుదలయ్యే అతిపెద్ద సినిమా 'సలార్‌' అనే చెప్పవచ్చు.

(ఇదీ చదవండి: చిరంజీవి 'చూడాలని ఉంది' సినిమాకు 25 ఏళ్లు.. ఈ విషయాలు తెలుసా?)

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)