Breaking News

అప్పట్లోనే సొంతంగా హెలికాప్టర్‌ కొన్న ఏకైక హీరోయిన్‌ కేఆర్‌ విజయ.. ఇప్పుడెలా ఉందంటే!

Published on Sat, 03/25/2023 - 09:17

సీనియర్‌ నటి కేఆర్‌ విజయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన ఆమె దేవత పాత్రలతో ఎక్కువగా గుర్తింపు పొందారు. దాదాపు స్టార్‌ హీరోలందరి సరసన నటించిన ఆమె దివంగత నటుడు సీనియర్‌ ఎన్టీఆర్‌, అక్కినేని నాగేశ్వరావు లెజెండ్స్‌తో పాటు సూపర్‌ స్టార్‌ కృష్ణ, కృష్ణంరాజు వంటి అగ్ర నటుల సరసన నటించి మెప్పించారు. స్టార్‌ నటిగా కొనసాగుతున్న క్రమంలోనే ఓ బడా వ్యాపావేత్తనుపెళ్లి చేసుకున్న ఆమె బాగా సెటిలైపోయారు.

చదవండి: అప్పుడు విష్ణుకు సన్నిహితంగా.. ఇప్పుడు మనోజ్‌ అనుచరుడిగా.. అసలు ఎవరీ సారథి?

భర్త చనిపోవడంతో కూతురితో కలిసి చెన్నైలో నివసిస్తున్న కేఆర్‌ విజయ గతంలో ఓ యూట్యూబ్‌ చానల్‌తో ముచ్చటించింది. తాజాగా ఆమె పాత వీడియో మరోసారి వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా తన గురించిన పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. కాగా పెళ్లి అనంతరం ఓ మహారాణిలా లైఫ్‌ లీడ్‌ చేసిన ఆమె వేల కోట్ల ఆస్తులు కూడబెట్టారట. అప్పట్లోనే ఆమెకు సొంతంగా హెలికాప్టర్‌ ఉండేదని, దానిని ఆమె భర్తే నడిపేవారని చెప్పారు. కేరళ, హైదరాబాద్‌, తమిళనాడు ఇలా ఎక్కడ సినిమా షూటింగ్స్‌ ఉన్నా సొంత హెలికాప్టర్‌లోనే ప్రయాణించేవారట.

చదవండి: స్టార్‌ హీరో అజిత్‌ ఇంట తీవ్ర విషాదం

అప్పట్లో ఏ హీరో కూడా సొంత హెలికాప్టర్‌ లేకపోవడం గమనార్హం. ఆమె భర్తకు వివిధ రకాలు బిజినెస్‌ ఉండేవని, ఈ క్రమంలో మద్రాస్‌ సమీపంలో ఏకంగా 67 ఎకరాలు తోట కోనుగోలు చేసినట్లు చెప్పారు. అంతేకాదు ఆమె రాజభవనం లాంటి లగ్జరీ ఇంటిని నిర్మించుకున్నారట. దీనిపై హెలికాప్టర్‌ ల్యాండ్‌ అయ్యేదని అప్పట్లో విజయ రాజా వైభోగం గురించి ఇండస్ట్రీలో అంతా చర్చించుకునేవారట. ఇంటిలో స్విమ్మింగ్ పూల్‌తో పాటు.. అన్ని రకాల వసతులు ఉండేవట. ఆమె ఇంటిలోని లగ్జరీ వసతులు చూసి అప్పట్లోని స్టార్‌ హీరోలు సైతం ఆశ్చర్యపోయేవారట. ఇక తన భర్త మరణాంతరం బిజినెస్‌ వ్యవహారాలను కొంతకాలం పాటు ఆమె చూసుకున్నారట. ప్రస్తుతం వ్యాపారాలను తన కూతురు చూసుకుంటున్నట్లు కేఆర్‌ విజయ తెలిపారు. 

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)