Breaking News

జమునని బాయ్‌కాట్‌ చేసిన ఎన్టీఆర్‌-ఏఎన్నార్‌.. అయినా లెక్కచేయని నటి

Published on Fri, 01/27/2023 - 12:26

గడుసుతనం కలబోసిన సౌందర్యానికి పెట్టింది పేరు జమున. వెండితెర సత్యభామగా ప్రేక్షకుల మనసులో నిలిచిపోయిన జమున సినీ పరిశ్రమలో తనకంటూ  ప్రత్యేక ముద్రను వేసుకున్నారు. పొగరు, భక్తి, విలనిజం ఇలా నవరసాలు పలకించగలిగే అరుదైన నటిగా పేరు సంపాదించుకున్నారు.  తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించారు. ఆమె కోసమే కొన్ని పాత్రలు పుట్టాయేమో అనేంతలా నటించి మెప్పించారు.

ఆనాటి స్టార్‌ హీరోలందరితో జతకట్టిన జమున కెరీర్‌ సాఫీగా సాగుతున్న దశలోనే ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌తో విభేదాలు అప్పట్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇకపై జమునతో నటించమని ఈ ఇద్దరు స్టార్‌ హీరోలు బాయ్‌కాట్‌ కూడా విధించారు. దీంతో ఇక జమున కెరీర్‌ ముగిసిపోతుందేమో అనుకున్నారంతా. అయినా సరే చేయని తప్పుకు సారీ చెప్పేది లేదంటూ భీష్మించుకున్న తీరు ఆమె ఆత్మాభిమానానికి అద్దం పడుతుంది.

అగ్రస్థాయి హీరోలు పక్కన పెట్టినా లెక్కచేయకుండా హరనాథ్, జగ్గయ్య వంటి హీరోలతో నటించి వరుస విజయాలు అందుకున్నారు. ఆ తర్వాత గుండ‌మ్మ క‌థ సినిమా కోసం అప్పటి నిర్మాత చక్రపాణి జోక్యం చేసుకొని స్టార్‌ హీరో,హీరోయిన్ల మధ్య విభేదాలు సరైనవి కావని కాంప్రమైజ్‌ చేయడంతో జమున గుండమ్మ కథలో నటించారు. ఎన్టీఆర్‌కు జోడీగా సావిత్రి, ఏఎన్నార్‌ సరసన జమున అలరించారు. సావిత్రి సౌమ్యంగా నటించిన తీరు, జమున కొంటెతనంతో పలికించిన సంభాషణలు ప్రేక్షకుల గుండెల్లో ఇప్పటికీ చిరస్మరణీయమే. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)