Breaking News

సీనియర్ నటుడు శరత్ బాబుపై అసత్య వార్తలు.. సోదరి క్లారిటీ

Published on Wed, 05/03/2023 - 21:20

శరత్ బాబు చనిపోయారని  సోషల్ మీడియాలో వార్తలు వైరల్ కావడంపై ఆయన సోదరి స్పందించింది. ఆ వార్తలు పూర్తిగా అసత్యమని కొట్టిపారేసింది. శరత్ బాబు చనిపోలేదని.. ఆయన ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతు‍న్నారని తెలిపింది. త్వరలోనే కోలుకుంటారని ఆశిస్తున్నాం.' అని తెలిపారు. అయితే సోషల్ మీడియాలో పలువురు శరత్ బాబు చనిపోయినట్లు  వైరల్ చేయడంతో తాజాగా ఆమె క్లారిటీ ఇచ్చింది. 

(ఇది చదవండి: ఆస్పత్రిలో చేరిన సీనియర్ నటుడు శరత్ బాబు!)

శరత్ బాబు సోదరి మాట్లాడుతూ..' సోషల్ మీడియాలో శరత్ బాబు గురించి వచ్చే వార్తలు అన్ని తప్పుగా వస్తున్నాయి. ఇప్పుడే కొంచెం రికవరీ అయి.. వేరే రూముకు షిఫ్ట్ చేయడం జరిగింది. తొందరలోనే శరత్ బాబు పూర్తిగా కోలుకుని మీ అందరితో మాట్లాడుతారని ఆశిస్తున్నా.' అని అన్నారు. 

కాగా.. ఇటీవలే శరత్ బాబు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు త్వరగ కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు.

(ఇది చదవండి: చిరంజీవితో రొమాన్స్ చేయాలని ఉంది: స్టార్ హీరోయిన్)

మూడు సార్లు నంది అవార్డులు

శరత్ బాబు హీరోగా నటించిన తొలిచిత్రం 1973లో విడుదలైన రామరాజ్యం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత  కన్నెవయసు, పంతులమ్మ, అమెరికా అమ్మాయి చిత్రాల్లో నటించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో ఎన్నో సినిమాలో నటించి మంచి నటుడిగా పేరు సంపాదించారు.   తర్వాత తెలుగులో బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన చిలకమ్మ చెప్పింది సినిమాలో నటించారు. కొన్నేళ్ల పాటు వెండితెరపై కనిపించిన శరత్ బాబు ప్రస్తుతం చాలా తక్కువగా కనిపిస్తున్నారు. శరత్ బాబు దాదాపు 220కి పైగా సినిమాల్లో నటించారు. మూడు సార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు. 

Videos

కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు

Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ

విక్రమ్ తో సినిమా కి కండిషన్స్ పెడుతున్న మీనాక్షి

Operation Sindoor: పారిపోండ్ర బాబు.. బతికుంటే మళ్లీ కలుద్దాం

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

తిరకాసు గోవా టూర్ ప్లాన్ ఫెయిల్

జగన్ అప్పుడే చెప్పాడు.. వీరమల్లు రిలీజ్ కోసం పవన్ కష్టాలు..

జగనన్నను మళ్లీ సీఎం చేస్తాం.. అన్న కోసం ఎన్ని కేసులకైనా సిద్ధం

PSLV-C61 ఫెయిల్యూర్ పై పరిశీలనకు కమిటీ

హిందూపురంలో బాలయ్య భారీ బిల్డప్.. జనాల్లోకి వెళితే సీన్ రివర్స్

Photos

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)