Breaking News

చివరి కోరిక తీరకుండానే ప్రాణాలు వదిలేసిన నటుడు సాక్షి రంగారావు..

Published on Thu, 01/30/2025 - 11:46

రంగావఝల రంగారావు. ఈ పేరు ఎవ్వరికీ తెలియదు. కానీ, సాక్షి రంగారావు అంటే అందరికీ సుపరిచితులే. సినిమాలలో విలన్‌ పాత్రలే వేసినప్పటికీ నిజ జీవితంలో సౌమ్యతత్త్వం ఉంటుంది. పాత్ర ఏదైనా సరే అద్భుతంగా ప్రజంట్ చేసి ప్రేక్షకులను మెప్పించే నిజమైన నటుడు సాక్షి రంగారావు. బాపురమణల కాంబినేషన్‌లో వచ్చిన సాక్షి సినిమాతో ఆయనకు మొదటి ఛాన్స్‌ రావడంతో తన పేరుకు ముందు సినిమా టైటిల్‌ను చేర్చుకున్నారు. ఆ సినిమాతో మొదలైన అదృష్ట ఘడియలు.. రంగారావు తుది శ్వాస వరకు ఆయనను వరిస్తూనే వచ్చాయి. అయితే, సుమారు 450 సినిమాల్లో విభిన్నమైన పాత్రలలో నటించిన సాక్షి రంగారావు నటిస్తూనే స్టేజీ మీద కుప్పకూలి ప్రాణాలు వదిలేశారు. అలా తన జీవితమంతా నటనకే అంకితం చేశారని చెప్పవచ్చు.

ప్రకాశం జిల్లా కలవకూరు (అద్దంకి – సింగర కొండ మధ్య)లో సాక్షి రంగారావు పుట్టారు. ఆయన తండ్రి చిన్నవయసులోనే మరణించడంతో బంధువల దగ్గర మచిలీపట్నంలోని  పామర్రులో పెరిగారు. వైజాగ్‌లో చదవు పూర్తి అయ్యాక డిప్లొమా ఇన్‌ యాక్టింగ్‌ చేశారు. ఆపై పలు స్టేజీ నాటకాలలో పనిచేశారు. అలా మద్రాస్‌ వెళ్లి బాపురమణలను కలవడం వారు తెరకెక్కించే సాక్షి సినిమాలో ఛాన్స్‌ దక్కించుకోవడం జరిగిపోయింది. సినిమా అవకాశాలు రావడంతో ఆయన మద్రాస్‌లోనే సెటిల్‌ అయ్యారు. ఈ క్రమంలో ఆయనకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి కూడా ఉన్నారు. వారిలో సాక్షి శివ పలు తెలుగు సీరియల్స్‌లలో నటిస్తున్నారు.

చివరి కోరిక తీరకుండానే ప్రాణాలు వదిలేశారు
‘కన్యాశుల్కం’ ఏడు గంటల పాటు సాగే ఆ నాటకంలో నటించాలని  సాక్షి రంగారావు అనుకున్నారు. మరో వారం రోజుల్లో ప్రదర్శన అనగా ... ఉన్నట్టుండి స్టేజీపైనే కుప్ప కూలిపోయారు. ఆ తర్వాత ఆసుపత్రిలో చేరిపించగా కొద్దిరోజులు ట్రీట్‌మెంట్‌కు సహకరించిన ఆయన తర్వాత అనారోగ్య సమస్యలు ఎక్కువ అయ్యాయి. అక్కడ చికిత్స తీసుకుంటూనే జూన్‌ 2005లో ప్రాణాలు వదిలేశారు. అందరూ కోలుకుంటున్నారనుకుంటుండగా కన్నుమూసి అభిమానులను ఏడిపించారు. 

అలా ఆయన జీవితం చివరి వరకు కళా రంగంలో నటిస్తూనే ముగిసిపోయింది. ఆయన చివరి కోరిక కన్యాశుల్కంలో నటించడం. అది తీరకుండానే ఆయన దూరం కావడంతో కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులను కూడా తీవ్రంగా బాధించింది. నటుడిగా జీవితాంతం కొనసాగాలని చాలామంది నటీనటులు కోరుకుంటారు. నటనకే తన జీవితాన్ని అంకితం చేయాలని భావిస్తారు కూడా.. అయితే, ఆ అదృష్టం అందరికీ దక్కకపోవచ్చు. కానీ, సాక్షి రంగారావు విషయంలో అది జరిగింది.

సాక్షి రంగారావు లేకుండా వారి సినిమాలు లేవు
ఇండియన్‌ టాప్‌ దర్శకులలో  విశ్వనాథ్ పేరు తప్పకుండా ఉంటుంది. అయితే, సాక్షి రంగారావు లేకుండా ఆయన ఒక్క సినిమా కూడా తీయలేదు. దాదాపు ఆయన దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలోనూ సాక్షి రంగారావు కోసం ఒక పాత్ర తప్పకుండా ఉంటుంది. శంకరాభరణంలో శంకరశాస్త్రి ట్రూప్ లో మృదంగం వాయించే పాత్ర ఇప్పటి తరం వారికి కూడా గుర్తే.. అలాగే దర్శకులు వంశీ తెరకెక్కించిన దాదాపు అన్ని సినిమాల్లోనూ సాక్షి రంగారావుకు తప్పనిసరిగా ప్లేస్ ఉండేది. ఆయన సినిమాల్లో ఏదో ఒక పాత్ర చేస్తూనే రంగారావు వచ్చారు.  

మంచు పల్లకి, సితార సినిమాలలో ఆయన నటన అద్భుతంగా ఉంటుంది. స్క్రీన్ మీద తన పాత్ర ఏదైనా సరే   అద్భుతంగా నటించేస్తారు సాక్షి రంగారావు. విలన్‌గా చేసినా కూడా జనం మెచ్చుకున్నారు. కామెడీ చేసినా పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు. తెరపై సెంటిమెంట్ పండించినా  కళ్లు తుడుచుకోకుండా ప్రేక్షకులు ఉండలేకపోయారు. చిత్రపరిశ్రమలో ఇలాంటి క్యాటగిరీలో సాక్షి రంగారావు మాత్రమే ఉంటారని చెప్పవచ్చు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)