Breaking News

నా ఇద్దరు కూతుర్లు ఇప్పటికీ నిత్యానంద దగ్గరే ఉన్నారు: నటుడు

Published on Wed, 05/24/2023 - 13:52

గురువును మించిన శిష్యులు, బుద్ధిమంతులు.. వంటి సూపర్‌ హిట్స్‌ చిత్రాల్లో నటించారు సీనియర్‌ నటుడు అశోక్‌ కుమార్‌. ఆరడుగుల ఎత్తుతో అందగాడిగా పేరు తెచ్చుకున్న ఆయన సడన్‌గా చిత్రపరిశ్రమకు గుడ్‌బై చెప్పారు. నచ్చని పెళ్లితో మొదట్లో తిప్పలు పడ్డ ఆయన తర్వాత భార్యను అక్కున చేర్చుకున్నారు. కానీ వారి సంతానమే తనకు తలవంపులు తెచ్చిందంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

ఇష్టం లేని పెళ్లి
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అశోక్‌ కుమార్‌ మాట్లాడుతూ.. 'మొదట నేను పోలీసాఫీసర్‌గా పని చేశాను. కానీ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్‌లో ఓ హోటల్‌ నడిపాను. అందులో నష్టాలు రావడంతో అక్కడికి వెళ్లడమే మానేశాను. అది ఇంకా దివాలా తీయడంతో మా బావగారు వచ్చి ఆ హోటల్‌ చూసుకున్నారు. ఖాళీగా ఎందుకు ఉండటమని మద్రాసు వెళ్లాను. విలన్‌గా, సహాయ నటుడిగా సినిమాలు చేశాను. రామానాయుడు నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తా అన్నారు.

అందుకే సినిమాలు మానేశా..
చివరకు అక్కినేని నాగేశ్వరరావు ఇచ్చిన సలహా వల్ల నన్ను తీసేసి జగ్గయ్యను హీరోగా పెట్టారు. ఇలా కొన్ని సంఘటనలు జరగడంతో నా ఆత్మాభిమానం దెబ్బతింది. ఇలాంటి ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానా? ఇక్కడికి వచ్చి తప్పు చేశానేనని ఫీలయ్యాను. ఈ సినీ ఇండస్ట్రీకి నేను పనికి రాను అని అర్థమైంది. అందుకే సినిమాలు మానేశాను' అని చెప్పుకొచ్చారు.

ముగ్గురికి పెళ్లి చేశా.. ఇద్దరికి విడాకులు
తన కుటుంబం గురించి మాట్లాడుతూ.. 'నా కుటుంబమే నాకు శత్రువు. అమ్మాయిని చూడకుండానే పెళ్లి చేసుకున్నాను. తీరా మండపంలో చూశాక ఆమె నాకు నచ్చలేదు.  కానీ చేసేదేం లేక మనసొప్పకపోయినా పెళ్లి చేసుకున్నాను. ఈ కారణం వల్లే ఉద్యోగానికి రాజీనామా చేశాను. కొన్నాళ్లకు తప్పు తెలుసుకున్నాను. నా వల్ల అమ్మాయిని బాధపడుతోందని తనను నాతోపాటే మద్రాసుకు తీసుకొచ్చాను. మాకు ముగ్గురు ఆడపిల్లలు.. పెద్ద చదువులు చదివించాను. ముగ్గురికీ పెళ్లి చేశా.. ఇద్దరికి విడాకులయ్యాయి.

నిత్యానంద మాయలో పడి ఇప్పటికీ అతడితోనే!
రెండో అమ్మాయి రంజితకు స్వామి నిత్యానందతో పెళ్లి జరిగిందని వార్తలు వచ్చాయి. నాకది నిజమో, కాదో తెలియదు. వాళ్లిద్దరూ క్లోజ్‌గా ఉన్న ఫోటోలయితే ఉన్నాయి. ఒక్కటైతే నిజం.. నిత్యానంద వల్లే ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తికి విడాకులిచ్చింది. కోపంతో నేనోసారి నిత్యానంద దగ్గరకు వెళ్లి.. నీకు సిగ్గు అనిపించడం లేదా? నా కూతుర్ని నీ ఆశ్రమం నుంచి వెనక్కు పంపించు అని అడిగాను. నా కోపాన్ని, బాధను అర్థం చేసుకునేవాళ్లే లేరు. నిత్యానంద మాయలో పడి నా ఇద్దరు కూతుళ్లు అతడి వెంటే వెళ్లారు. ఇప్పటికీ అతడితోనే ఉన్నారు. ఇదంతా భరించలేక నా భార్య అనారోగ్యానికి గురై మరణించింది. నా మూడో కూతురే నన్ను చూసుకుంటోంది. మిగతా ఇద్దరూ ఇంతవరకు నాకు ఒక్క ఫోన్‌ కూడా చేయలేదు' అని ఎమోషనలయ్యారు అశోక్‌ కుమార్‌.

చదవండి: హోటల్‌లో విగతజీవిగా కనిపించిన నటుడు

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)