Breaking News

సీన్‌ రివర్స్‌.. ధనుష్‌ డైరెక్షన్‌లో నటించనున్న సెల్వ రాఘవన్‌!

Published on Wed, 07/19/2023 - 11:25

బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయన్నది సామెత మాత్రమే కాదు.. జీవిత సత్యం కూడా. దర్శకుడు సెల్వ రాఘవన్‌, నటుడు ధనుష్‌ల కథ ఇంచుమించు ఇలాంటిదే. వీరిద్దరూ అన్నదమ్ములు అన్న విషయం తెలిసిందే! ఇద్దరు ఒకేసారి సినీ ప్రయాణం ప్రారంభించారు. తుళ్లువదో ఇళమై చిత్రంతో సెల్వరాఘవన్‌ దర్శకుడుగా, ధనుష్‌ నటుడుగా పరిచయం అయ్యారు. 

ఈ చిత్రం తర్వాత కాదల్‌ కొండాన్‌, పుదుపేట్టై, మయక్కం వంటి ఎన్నో చిత్రాలు రూపొందించి మంచి విజయాలను అందుకున్నారు. ఆ తర్వాత సెల్వరాఘవన్‌, ధనుష్‌ ఎవరి బాటలో వారు ప్రయాణించారు. చాలా కాలం తర్వాత ఇటీవల 'నానే వరువేన్‌' చిత్రంతో మళ్లీ కలిశారు. అయితే ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ విషయాన్ని పక్కన పెడితే ధనుష్‌ కథానాయకుడిగా చాలా ఎత్తుకు ఎదిగిపోయారు. దర్శకుడిగా, నిర్మాతగా విజయాలను అందుకున్నారు. కాగా ఇప్పుడు దర్శకుడు సెల్వరాఘవన్‌ కూడా నటుడిగా అవతారం ఎత్తారు. ఈయన సాని కాగితం చిత్రంలో ప్రధాన పాత్రను పోషించి ప్రశంసలను అందుకున్నారు.

అదేవిధంగా బీస్ట్‌, నానేవరువేన్‌ చిత్రాలలో కీలకపాత్రలను పోషించారు. రుద్ర తాండవం చిత్రంలో కథానాయకుడిగానూ నటించారు. తాజాగా సెల్వ రాఘవన్‌.. తాను కథానాయకుడిగా పరిచయం చేసిన తన సోదరుడు ధనుష్‌ దర్శకత్వంలో నటిస్తున్నారు. ధనుష్‌ తన 50వ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తూ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో సెల్వ రాఘవన్‌ ముఖ్యపాత్రను పోషిస్తున్నట్లు తాజా సమాచారం. నటి దుషారా నాయకిగా నటిస్తున్న ఇందులో ఎస్‌ జే సూర్య, సందీప్‌ కిషన్‌, కాళిదాస్‌ జయరాం, అపర్ణ బాలమురళి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇది ఉత్తర చైన్నె నేపథ్యంలో తెరకెక్కుతున్న గ్యాంగ్‌ స్టార్‌ కథా చిత్రం అని తెలిసింది.

చదవండి: భారీ రెమ్యునరేషన్‌ అందుకుంటున్న కీర్తి సురేశ్‌.. ఎంతంటే?
మిథునం రచయిత కన్నుమూత

Videos

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)