Breaking News

పారితోషికం తీసుకొని చాలా నష్టపోయా : శేఖర్‌ కమ్ముల

Published on Thu, 06/19/2025 - 11:10

‘‘నా కెరీర్‌లోని మ్యూజికల్, లవ్‌స్టోరీ చిత్రాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. దీంతో నా పై ఓ మార్క్‌ పడింది. కానీ కథకు ఏం కావాలో అదే చేశాను. ‘లీడర్‌’ చాలా నిజాయితీగా చెప్పిన కథ. ఈ కథలో లవ్‌స్టోరీ, మంచి పాటలు పెట్టాలనుకోలేదు. ‘హ్యాపీడేస్‌’ కాలేజ్‌ స్టోరీ కాబట్టి కాలేజీ స్టోరీలానే ట్రీట్‌ చేశాను. ‘కుబేర’ సినిమా కూడా అంతే. ఈ కథకు కావాల్సిందే చేశాను. చెప్పాలంటే... నేను కథను డైరెక్ట్‌ చేయడం కాదు... కథే నన్ను డైరెక్ట్‌ చేస్తుంటుంది’’ అని అన్నారు దర్శకుడు శేఖర్‌ కమ్ముల

(చదవండి: నా కళ్లలో నీళ్లు తిరిగాయి.. అందుకే ఆమె పెళ్లికి సాయం చేశా: శేఖర్ కమ్ముల)

ధనుష్, నాగార్జున హీరోలుగా నటించిన చిత్రం ‘కుబేర’. రష్మికా మందన్నా, జిమ్‌ సర్భ్‌ ఇతర కీలక పాత్రల్లో నటించారు. శేఖర్‌ కమ్ముల అమిగోస్‌ క్రియేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో కలిసి సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు నిర్మించారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రేపు విడుదల కానున్న సందర్భంగా బుధవారం విలేకరుల సమావేశంలో శేఖర్‌ కమ్ముల చెప్పిన విశేషాలు. 

‘కుబేర’ సినిమా ముంబై నేపథ్యంలో సాగుతుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను చిత్రీకరించాం. ఒక సూపర్‌ రిచ్‌ ప్రపంచం, ఇంకొకటి అట్టడుగున ఉండే ప్రపంచం... ఇలా రెండు విభిన్నమైన ప్రపంచాలను ప్రేక్షకులు చూస్తారు. తనకి ఏమీ వద్దని, ఏ ఆశ లేని ఒక బెగ్గర్, ఈ ప్రపంచంలోని అన్నీ తనకే కావాలనుకునే ఒక బిలియనీర్‌ మధ్య ఉండే కాన్‌ఫ్లిక్ట్‌ ఈ సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే... బెగ్గర్‌ వర్సెస్‌ బిలియనీర్‌. ఈ తరహా కథలను చెప్పినప్పుడు పేదవారే గెలుస్తుంటారు. కానీ అది ఎలా ప్రజెంట్‌ చేశాం అన్నది ఈ సినిమాలో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎమోషనల్‌ థ్రిల్లర్‌గా ఉంటుందీ సినిమా. 

‘మనం, ఊపిరి’ వంటి సినిమాల్లో డిఫరెంట్‌ వేరియేషన్స్‌ ఉన్న పాత్రల్లో నాగార్జునగారు నటించారు. ‘కుబేర’లో కూడా ఆయన కొత్తగా కనిపిస్తారు. ఈ సినిమాలోని పాత్రలో ఆయన ఇమిడిపోయిన తీరు అద్భుతం. ఇక ఈ చిత్రంలోని దేవా పాత్రలో ధనుష్‌ సూపర్‌గా నటించారు. ధనుష్‌ బెగ్గర్‌గా కనిపిస్తారు. దేవా పాత్రలో ధనుష్‌గారిని తప్ప ఆడియన్స్‌ మరొకరిని ఊహించలేరు. 

రష్మికా మందన్నా తన యాక్టింగ్‌తో ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తుంది. బాలీవుడ్‌ నటుడు జిమ్‌ సర్భ్‌కు తెలుగు రాకపోయినా తెలుగు డైలాగ్స్‌ను బట్టీ పట్టి మరీ చక్కగా చెప్పారు. నా గత చిత్రాలతో పోలిస్తే నా మార్క్‌ ‘కుబేర’ సినిమాలో పదింతలు ఎక్కువగా ఉంటుంది.  

నా పాతికేళ్ల జర్నీని చూసుకున్నప్పుడు ఎమోషనల్‌గా అనిపిస్తుంది. నా స్నేహితుల దగ్గర డబ్బులు తీసుకుని సినిమాలు తీసిన రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. కానీ ఎక్కడా ఎదురు దెబ్బలు తగలలేదు. అది నా అదృష్టం. సినిమాల లాభాల విషయంలో కూడా నాకింత పర్సంటేజ్‌ కావాలని ఎప్పుడూ అడగను.. పారితోషికం తీసుకుంటానంతే. దీని వల్ల చాలా నష్టపోయాను. అయినా బాధలేదు. ప్రేక్షకుల ప్రేమే నాకు ముఖ్యం. నా కథలన్నీ నా జీవితంలో నేను చూసిన, నాకు తారసపడిన వ్యక్తుల జీవితాల్లోనివారివే. ఇక ‘లీడర్‌’కు సీక్వెల్‌ ఆలోచన ఉంది. కానీ ఇప్పటి రాజకీయ వ్యవస్థలో, ప్రజల్లో మార్పులొచ్చాయి. ఏదైనా స్ట్రాంగ్‌ పాయింట్‌ను పట్టుకోవాలి. ఇక నానీతో చేసే సినిమాకు వర్క్‌ జరగాల్సి ఉంది.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)