Breaking News

ఎవరైనా ప్రేమిస్తారని చూస్తున్నా.. ఒకప్పటి ట్రెండింగ్‌ బ్యూటీ

Published on Mon, 02/10/2025 - 13:44

‘రన్‌ రాజా రన్‌’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్‌గా సీరత్‌ కపూర్‌ పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘టైగర్‌’, ‘రాజుగారి గది 2’,‘ఒక్క క్షణం’ వంటి చిత్రాల్లో సీరత్‌ నటనకు ప్రేక్షకులు మంచి మార్కులేవేశారు. సిద్ధూ జొన్నలగడ్డతో తను నటించిన కృష్ణ అండ్‌ హీజ్‌ లీల సినిమా ఈ వాలంటైన్స్ డే సందర్భంగా  'ఇట్స్‌ కాంప్లికేటెడ్‌' పేరుతో విడుదల కానుంది. ఈ సందర్భంగా సడెన్‌గా హైదరాబాద్‌లో కనిపించిన ఈ బ్యూటీ వాలంటైన్స్ డే ప్లాన్స్  గురించి చెప్పింది.

ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా..? అంటూ సీరత్‌ కపూర్‌ను మీడియా ప్రశ్నించగా అందుకు ఆమె చాలా ఫన్నీగా సమాధానం చెప్పింది. ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉన్నాని ఆమె క్లారిటీ ఇచ్చింది. గతంలో కూడా లవర్‌ లేడని పేర్కొంది. అయితే, ఈ ఫిబ్రవరి 14న వాలంటైన్స్‌ డే నాడు ఎవరైనా రోజా పువ్వు ఇస్తారేమోనని ఎదురుచూస్తున్నానని చెప్పింది. వాస్తవంగా ఆమెపై పెద్దగా రూమర్స్‌  వచ్చిన వార్తలు కనిపించవు. చిత్ర పరిశ్రమలోని ప్రతి హీరోయిన్‌ ఫలానా వ్యక్తితో డేటింగ్‌ అంటూ రూమర్స్‌ రావడం కామన్‌గా మారింది. కానీ, సీరత్‌పై అలాంటివి కనిపించవ్‌. తాజాగా ఆమె చేసిన కామెంట్‌తో ఫిబ్రవరి 14న ఆమెకు చాలా రోజా పూలు రావచ్చని నెటిజన్లు తెలుపుతున్నారు.  

గతంలో కూడా లవ్‌ లవ్‌ ప్రపోజల్స్‌ గురించి ఆమె ఇలా చెప్పింది. కాలేజ్‌ డేస్‌లో కొంతమంది అబ్బాయిలు ప్రపోజ్‌ చేశారని ఆమె తెలిపింది. అబ్బాయిలు అంత ధైర్యంగా అమ్మాయిలకు ఎలా ప్రపోజ్‌ చేస్తారా..? అని నవ్వుకునేదాన్ని. 'ఆ విషయంలో అబ్బాయిలంటే నాకు గౌరవం ఏర్పడింది. అయితే నేను ఎవరి లవ్‌నీ అంగీకరించలేదనుకోండి (నవ్వుతూ).  షూటింగ్‌లు ఆరంభమయ్యాక రొమాంటిక్‌ సీన్స్‌ చేయాలంటే.. కథలోని పాత్ర డిమాండ్‌ చేస్తే ఆ సీన్స్‌లో నటిస్తాను. తప్పదు' అని పేర్కొంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)