Breaking News

తెలుగులో స్ట్రీమింగ్‌లోకి వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా

Published on Sat, 08/01/2026 - 16:47

ఓటీటీలు అనగానే దాదాపు అందరికీ థ్రిల్లర్ సినిమాలే గుర్తొస్తాయి. అందుకు తగ్గట్లే మలయాళీ దర్శకులు ఎక్కువగా ఈ జానర్ మూవీస్ తీస్తుంటారు. వీటికి ఓటీటీల్లో అద్భుతమైన ఆదరణ దక్కుతూ ఉంటుంది. అప్పుడప్పుడు కన్నడం నుంచి థ్రిల్లర్స్ వస్తుంటాయి. అలాంటి ఓ మూవీనే 'సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం'. చాన్నాళ్ల క్రితమే ఇది ఓటీటీలోకి వచ్చినప్పటికీ ఇప్పుడు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ దీని సంగతి ఏంటి? ఎందులో చూడొచ్చు?

(ఇదీ చదవండి: విజయ్ సీఎం కావడంపై ఎట్టకేలకు స్పందించిన కొడుకు)

2021లో రిలీజైన 'సీతారాం బెనోయ్: కేస్ నంబర్ 18' సినిమాకు సీక్వెల్ ఇది. విజయ్ రాఘవేంద్ర హీరో కాగా దేవిప్రసాద్ శెట్టి దర్శకుడు. సస్పెన్స్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథతో ఈ మూవీని తెరకెక్కించారు. కొన్నాళ్ల క్రితం తొలుత అమెజాన్ ప్రైమ్ ఓటీటీ కన్నడలో ఆపై హిందీ, తమిళంలో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్నట్లు ప్రకటించారు.

'సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం' విషయానికొస్తే.. మొదటి కేసులో భాగంగా భార్యని పోగొట్టుకొని ఒంటరిగా జీవిస్తుంటాడు పోలీస్ అధికారిక సీతారాం(విజయ్ రాఘవేంద్ర). ఆనెగడ్డ గ్రామంలోనే పనిచేస్తూ ఉంటాడు. అంతా ప్రశాంతంగా ఉందనుకునే టైంలో మళ్లీ వరస హత్యలు కలకలం రేపుతాయి. గుర్తు తెలియని వ్యక్తి కొందరు వ్యక్తుల మెడ, చేతులకు గొలుసులు కట్టి అతి కిరాతకంగా చంపేస్తుంటాడు. దీంతో గ్రామస్థులు హడలిపోతారు. ఈ హత్యల్ని సీతారాం ఇన్వెస్టిగేట్ చేస్తాడు. మరి వీటి వెనుకున్న సైకో కిల్లర్ ఎవరు? అసలెందుకు చేస్తున్నాడు? చివరకు ఈ కిల్లర్‌ని సీతారాం పట్టుకున్నాడా? లేదా అనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి అఖిల్ 'లెనిన్'.. అధికారిక ప్రకటన)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)