Breaking News

ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు

Published on Fri, 04/12/2024 - 11:57

ప్రముఖ నటుడు సాయాజి షిండే ఆస్పత్రిపాలయ్యాడు. ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు గురువారం నాడు ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. నటుడిని పరీక్షించిన వైద్యులు అతడికి ఆంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం నటుడి పరిస్థితి నిలకడగా ఉంది. ఆస్పత్రి వైద్యుడు సోమనాథ్‌ మాట్లాడుతూ.. సాయాజి షిండే కొద్దిరోజుల క్రితమే అస్వస్థతకు లోనయ్యారు.

ఆంజియోప్లాస్టీ
దీంతో ఆయనకు కొన్ని పరీక్షలు చేయగా తన గుండెలో సమస్య ఉన్నట్లు తేలింది. హృదయంలోని కుడివైపు సిరలు పూర్తిగా మూసుకుపోయాయి. ఆంజియోప్లాస్టీ చేయాల్సిందేనని చెప్పాం. రెండుమూడు రోజుల క్రితం తన షూటింగ్స్‌ క్యాన్సిల్‌ చేసుకుని చికిత్స కోసం రెడీ అయ్యారు. పరిస్థితి విషమించకముందే జాగ్రత్తపడటంతో విజయవంతంగా సర్జరీ పూర్తి చేశాం. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. త్వరలోనే డిశ్చార్జ్‌ చేస్తాం అని వెల్లడించాడు.

బహుభాషానటుడు
కాగా సాయాజి షిండే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, భోజ్‌పురి, హిందీ భాషల్లో అనేక సినిమాలు చేశాడు. తెలుగులో.. గుడుంబా శంకర్‌, ఆంధ్రుడు, అతడు, పోకిరి, లక్ష్మి, ఆట, దుబాయ్‌ సీను, ఆర్య 2, అరుంధతి, మిస్టర్‌ పర్ఫెక్ట్‌, దూకుడు, బిజినెస్‌మెన్‌.. ఇలా అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి 'యాత్ర 2'

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)