Breaking News

సాయాజి షిండే హెల్త్ అప్డేట్ ప్రకటించిన వైద్యులు

Published on Sat, 04/13/2024 - 19:23

ప్రముఖ నటుడు సాయాజి షిండేకు ఏప్రిల్‌ 12న ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. మహారాష్ట్రలోని సతారాలో ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. సాయాజి షిండే కొద్దిరోజుల క్రితమే అస్వస్థతకు లోనయ్యారని డాక్టర్‌ సోమనాథ్‌ తెలిపారు. అందువల్ల ప్రస్తుతం ఆయనకు ఆంజియోప్లాస్టీ చేశామని ఆయన పేర్కొన్నారు.

సాయాజి షిండే హృదయంలోని కుడివైపు సిరలు పూర్తిగా మూసుకుపోయాయి. దాంతో ఆయనకు వైద్యులు ఆంజియోప్లాస్టీ చేశారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే డిశ్చార్జి చేస్తామని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు పేర్కొన్నారు. ఈ క్రమంలో సాయాజి షిండే కూడా ఇన్‌స్టాలో ఒక పోస్ట్‌ చేశారు. 'అందరికీ నమస్కారం, నేను చాలా బాగున్నాను. నన్ను ప్రేమించే నా శ్రేయోభిలాషులు చూపిన అభిమానానికి ఫిదా అవుతున్నాను. మీ అందరూ నాతోనే ఉన్నారు. చింతించాల్సిన పని లేదు. త్వరలోనే నేను మీ అందరి ముందుకు వస్తాను.' అని ఆయన అన్నారు.

సాయాజి షిండే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, భోజ్‌పురి, హిందీ భాషల్లో అనేక సినిమాలు చేశారు. తెలుగులో.. గుడుంబా శంకర్‌, ఆంధ్రుడు, అతడు, పోకిరి, లక్ష్మి, ఆట, దుబాయ్‌ శీను, ఆర్య 2, అరుంధతి, మిస్టర్‌ పర్ఫెక్ట్‌, దూకుడు, బిజినెస్‌మెన్‌.. ఇలా అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)