Breaking News

వరంగల్‌లో 'సత్యభామ' యూనిట్‌ సందడి

Published on Fri, 08/30/2024 - 13:38

తెలుగు సంస్కృతి , సంప్రదాయాలను ఆచరిస్తూ నిర్వహించిన ఉత్సాహభరితమైన వేడుకలో భాగంగా ప్రముఖ సీరియల్ ' సత్యభామ' లో నటించిన ముఖ్య తారాగణంతో  వరంగల్‌లో ఘనంగా వరలక్ష్మీ వ్రత పూజా  కార్యక్రమాన్ని స్టార్ మా నిర్వహించింది. ' సత్యభామ'  తారలు తమ మొదటి వరలక్ష్మీ వ్రతాన్ని వరంగల్ నగర ప్రజలతో కలిసి జరుపుకోవడం వల్ల  ఇది ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. గతంలో ఈ  తారల వివాహ రెసెప్షన్ వేడుకలు సైతం వరంగల్‌లో జరుగగా, అప్పుడు ఇక్కడి వారు అపూర్వమైన స్వాగతం పలికారు. 

వరలక్ష్మీ వ్రతం కార్యక్రమానికి భారీ సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. ' సత్యభామ'  సిరీయల్‌ నటీనటులు అందరూ వరలక్ష్మి పూజా కార్యక్రమాల్లో నిమగ్నమై భక్తిశ్రద్ధలతో పూజను కొనసాగించారు. హాజరైన మహిళలకు వాయనాలు అందించటంతో పాటుగా ప్రసాదాలు  పంపిణీ చేశారు.  అభిమానులు తమ ప్రేమ, అభిమానాన్ని చాటుకుంటూ కళాకారులను బహుమతులతో ముంచెత్తారు. ఈ షో తో తమకున్న లోతైన బంధాన్ని మరింతగా వెల్లడించారు. 

ఈ సీరియల్ హీరో క్రిష్ ప్రేక్షకులతో కలిసి నృత్యం చేయడంతో కార్యక్రమంలో ఆనందం తారాస్థాయికి చేరుకుంది. అసలైన తెలుగు శైలిలో పండుగ స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ ఆన్-స్క్రీన్ జంట వేదికపై నృత్యం చేయడంతో ఉత్సాహం మరింతగా పెరిగింది. ఈ కార్యక్రమానికి సాంస్కృతిక సంపదను జోడిస్తూ, ప్రత్యేక తోలుబొమ్మలాట ప్రదర్శన జరిగింది.  పురాతన కళను నేటి తరానికి గుర్తుచేస్తూ జరిపిన ఈ తోలుబొమ్మలాట,  తెలుగు ప్రజల  సంప్రదాయాలకు ఒక అందమైన తీపిగుర్తుగా నిలిచింది.

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)