Breaking News

మహేశ్‌ నోట ‘సత్యదేవ్‌ ఇన్‌..’ వెలకట్టలేని మాట ఇది : సత్యదేవ్‌

Published on Wed, 07/01/2026 - 19:49

మహేశ్‌ బాబు తో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా చేశాను. కాకపోతే అందులో నా సీన్ కట్ అయింది. అలాంటి మహేశ్‌ బాబు  నా సినిమా(రావు బహదూర్‌)కు వాయిస్ ఓవర్ ఇస్తూ ‘సత్యదేవ్ ఇన్...’ అని చెప్పగానే చాలా ఆనందంగా అనిపించింది. మహేశ్‌ బాబు ఇచ్చిన వాయిస్ ఓవర్ , ఆ మాట వెలకట్టలేనిది’ అని హీరో సత్యదేవ్‌ అన్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘రావు బహదూర్‌’. వెంకటేశ్‌ మహా దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 3న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో సత్యదేవ్‌ మీడియాలో ముచ్చటించారు. ఆ విశేషాలు..

→ రావు బహదూర్ కంప్లీట్ సైకాలజికల్ డ్రామా. మ్యాజికల్ రియలిజం, డార్క్ కామెడీ సబ్‌జానర్స్‌గా ఉంటాయి. ఏదైనా మెటాఫర్‌ను విజువల్‌గా చేసి చూపించడం మ్యాజికల్ రియలిజం. కాకపోతే, కొన్నిసార్లు ఇది హారర్‌లా అనిపించవచ్చు.  టీజర్‌లో మీరు వేర్లు వెంటాడుతున్న విజువల్ ఒకటి చూసి ఉంటారు. మీరు థియేటర్‌లో చూస్తున్నప్పుడు అది ప్రేక్షకులకు చాలా క్లియర్‌గా అర్థమవుతుంది.

→ మేము సినిమా మొదలుపెట్టినప్పుడు ‘మునుపెన్నడూ చూడని విధంగా తెలుగు సినిమా’ అనే ట్యాగ్‌లైన్‌ను అనుకున్నాము. మహేశ్‌ బాబు ఈ సినిమా చూసిన తర్వాత కూడా అదే ట్యాగ్‌లైన్ చెప్పారు. ఇప్పటివరకు సినిమా చూసిన ఫిలిం మేకర్స్ కూడా  ‘మునుపెన్నడూ చూడని తెలుగు సినిమా’ అని చెబుతున్నారు.

→ మనం మామూలుగా చేసే సినిమాల కంటే 300 శాతం ఎక్కువగా ఈ సినిమాకు కష్టపడ్డాను. ఇందులో నా క్యారెక్టర్‌కు మేకప్ వేయడానికి ఐదు గంటలు పట్టేది, తీయడానికి గంటన్నర పట్టేది. ఇలాంటి పాత్రలు చేయడానికి చాలా సహనం కావాలి.మేకప్ కంటే మైండ్ మేకప్ చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాకు అలాంటి మైండ్ మేకప్ చాలా చేశాను. ప్రతిరోజూ వెళ్లి 16 గంటలు పని చేయాలని ముందే నిర్ణయించుకునేవాడిని. అలా ప్రతిరోజూ హ్యాపీగా వెళ్లి ఎంజాయ్ చేస్తూ చేశాను.

→ కమల్ హాసన్, సూర్య, విక్రమ్  లాంటి హీరోలు ఇలాంటి హెవీ మేకప్ సినిమాలు ప్రయత్నిస్తుంటారు. అది చూస్తున్నప్పుడు నేను కూడా ఎప్పుడైనా అలాంటి సినిమా చేయాలని అనుకునేవాడిని. నేను యాక్టర్ అయినప్పటి నుంచి అది నా డ్రీమ్. ఆ అవకాశం 'రావు బహదూర్'తో వచ్చింది.

→ రావు బహదూర్‌లోని రామప్ప క్యారెక్టర్‌కు ఎలాంటి రిఫరెన్స్ తీసుకోలేదు. రామప్ప వెరీ మ్యాడ్ క్యారెక్టర్. ఈ సినిమా చూసిన తర్వాత రామప్పలా చేయాలి అని ఒక రిఫరెన్స్ పాయింట్ ఏర్పడుతుంది.ఈ సినిమా చేస్తున్నప్పుడు రామప్ప క్యారెక్టర్ నన్ను ఆవహించాడేమో అన్నట్టుగా అనిపించింది. అంతలా ఆ పాత్రలో లీనమైపోయాను.

→ ఈ సినిమాలో ప్రతి సన్నివేశంలో చాలా రిచ్ రైటింగ్, డీటైలింగ్ ఉంటుంది. వెంకటేశ్‌ మహా ప్రతి లేయర్‌ను చాలా అద్భుతంగా రాసుకున్నారు. అంతే అద్భుతంగా తీశారు. సినిమా రిపీట్‌గా చూసేలా ఉంటుంది.

→ 1960–99 మధ్య జరిగే కథ. ఇందులో కథానాయకుడు దేశసంచారి. తను అలా సంచారం చేస్తూ మళ్లీ తన ప్యాలెస్ భువనాలయంకి వచ్చినప్పుడు ఎలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయనేది ఆసక్తికరం.

→ ఈ సినిమా కోసం ఫిజికల్‌గా కొన్ని ఛాలెంజ్‌లు ఎదుర్కొన్నాను. కానీ మెంటల్‌గా నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. ఎందుకంటే సినిమా అంటే నాకు ఇష్టం. యాక్టర్‌గా  దీన్ని నేను ఒక వర్క్‌లా చూడను. ప్రతిరోజూ నాకు నచ్చిన పని చేశాననే ఆనందం ఉంటుంది.

→ ఆడియన్స్‌గా నన్ను నేను చూసుకుంటాను. నా నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఎందుకు ఎదురు చూడాలి అనే ప్రశ్నను నాకు నేనే వేసుకుంటాను.

→ మహేశ్‌ బాబు, నమ్రత కలిసి ఈ సినిమా చూశారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ సినిమా గురించి మాట్లాడారు. ఆయన టీజర్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చారు. అలాగే సుకుమార్ కూడా చూశారు. ఆయన కూడా మంచి రివ్యూ ఇచ్చారు. అందరూ కూడా ‘మునుపెన్నడూ చూడని తెలుగు సినిమా’ అని చెప్పారు.  ఎందుకు అలా చెప్పారో మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది.

→ కొత్త రకం సినిమాలు తమిళం, మలయాళం నుంచి వచ్చినప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తారు. మన దగ్గర ఎందుకు ఇలాంటి కొత్త రకం సినిమాలు లేవని ఒక డిస్కషన్ నడుస్తుంటుంది. అలాంటి వారందరికీ ఈ సినిమా ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. కచ్చితంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చాలా పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది. ఇది ఒక డిఫరెంట్ విజువల్ స్పెక్టాకిల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా. ప్రేక్షకుడు పెట్టే టికెట్‌కు పూర్తి విలువ ఇచ్చే సినిమా.

→ కొత్త సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘సమవర్తి’ సినిమా చేస్తున్నాను. ఇప్పటివరకు నేను చేయని సినిమా. అది ఒక ఫారెస్ట్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. ప్రస్తుతం ఒక కామెడీ సినిమా కూడా చేస్తున్నాను. అలాగే 'ఫుల్ బాటిల్' లో మాస్ క్యారెక్టర్ కూడా చేస్తున్నాను.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)