Breaking News

38 ఏళ్ల తర్వాత రజనీతో నటించనున్న కట్టప్ప

Published on Tue, 05/28/2024 - 12:47

రజనీకాంత్, దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌ కాంబినేషన్‌లో కూలీ అనే భారీ చిత్రం రూపొందుతోంది. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చాలా గ్యాప్‌ తరువాత హీరోయిన్‌ శోభన.. రజనీకాంత్‌తో కలిసి నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అలాగే ఇందులో శృతిహాసన్‌ రజనీకాంత్‌కు కూతురిగా నటించనున్నట్లు టాక్‌ వైరల్‌ అవుతోంది. అనిరుధ్‌ సంగీతం అందిస్తున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్‌ పైకి వెళ్లనుంది. ఇది గోల్డ్‌ స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే కథా చిత్రం అని సమాచారం. ఇందులో రజనీకాంత్‌ గెటప్‌ ఆయన అభిమానులు అదుర్స్‌ అనేలా ఉంది. 

38 ఏళ్ల తర్వాత..
ఇకపోతే ఇందులో నటుడు సత్యరాజ్‌ ముఖ్య పాత్ర  పోషించనున్నట్లు తాజా సమాచారం. వీరిద్దరూ 38 ఏళ్ల తరువాత మళ్లీ ఈ చిత్రంలో కలిసి నటించనున్నారన్నమాట. ఇంతకు ముందు రజనీకాంత్, సత్యరాజ్‌ కలిసి తంబిక్కు ఎంద ఊరు, మూండ్రు ముగం, పాయుం పులి, నాన్‌ సిగప్పు మణిదన్, మిస్టర్‌ భరత్‌ చిత్రాల్లో నటించారు. ఈ చిత్రాలన్నింటిలోనూ సత్యరాజ్‌ విలన్‌గానే నటించారు. 

అప్పుడు తండ్రిగా.. ఇప్పుడు..
మిస్టర్‌ భరత్‌ చిత్రంలో రజనీకాంత్‌కు తండ్రిగా నటించారు. అందులో ఎన్నమ్మా కన్ను సౌఖ్యమా అనే పాట సూపర్‌హిట్‌ అయ్యింది. తొలిసారిగా కూలీ చిత్రంలో రజనీకాంత్‌కు మిత్రుడిగా పాజిటివ్‌ పాత్రలో నటించనున్నట్లు తెలిసింది. దీంతో పడయప్పతో కట్టప్ప అంటూ అభిమానులు ఖుషీ అవుతున్నారు. కూలీ చిత్రానికి గిరీశ్‌ గంగాధరన్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

చదవండి: పెళ్లయిన మూడు నెలలకే విడిపోతున్నారా? అసలు విషయం ఇది

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)