Breaking News

విజయ్‌ ఆంటోని అలాంటివాడు.. ఈగో లేకుండా..: సత్యరాజ్‌

Published on Thu, 11/30/2023 - 10:06

నటుడు విజయ్‌ ఆంటోని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం వల్లి మయిల్‌. ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌ నటి ఫరియా అబ్దుల్లా కోలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. ఇందులో నటుడు సత్యరాజ్‌, దర్శకుడు భారతీరాజా, రెడిన్‌ కింగ్స్‌లీ, జీపీ ముత్తు ముఖ్యపాత్రలు పోషించారు. ఇంతకుముందు జీవా, పాండినాడు, అళగర్‌సామియిన్‌ కుదిరై వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన సుశీంద్రన్‌ తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం వల్లి మయిల్‌.

విజయ్‌.. నిరాడంబర వ్యక్తి
నల్లుసామి పతాకంపై డీఎన్‌ తాయ్‌ శరవణన్‌ నిర్మించిన ఈ చిత్రానికి డి.ఇమాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా సుశీంద్రన్‌ మాట్లాడుతూ.. విజయ్‌ ఆంటోని హీరోగా ఈ చిత్రాన్ని చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇక సత్యరాజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఇది రాజకీయ నేపథ్యంలో సాగే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కథా చిత్రంగా ఉంటుందన్నారు. సత్యరాజ్‌ మాట్లాడుతూ విజయ్‌ ఆంటోని చాలా నిరాడంబర వ్యక్తి అని, చాలా యథార్థంగా మాట్లాడతారని అన్నారు.

అప్పుడు ఎంజీఆర్‌.. ఇప్పుడు విజయ్‌ ఆంటోని
హీరోయిన్‌ పేరుతో రూపొందే చిత్రాల్లో నటించడానికి హీరోలు సాధారణంగా అంగీకరించరని, ఈగో అడ్డుపడుతుందని అన్నారు. అయితే అప్పట్లో ఎంజీఆర్‌.. రాజకుమారి, చంద్రలేఖ, అదేవిధంగా రజనీకాంత్‌.. చంద్రముఖి వంటి హీరోయిన్‌ పేర్లతో కూడిన చిత్రాల్లో నటించారన్నారు. అలా ఈ వల్లి మయిల్‌ చిత్రంలో విజయ్‌ ఆంటోని నటించారని చెప్పారు. కాగా ఇలాంటి సాఫ్ట్‌ టైటిల్‌ దర్శకుడు సుశీంద్రన్‌ రాజకీయ నేపథ్యంలో కమర్షియల్‌ అంశాలతో కూడిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కథా చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని సత్యరాజ్‌ ప్రశంసించారు.

చదవండి: తెలంగాణ ఎన్నికలు.. ఓటేసిన సెలబ్రిటీలు

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?