Breaking News

సరిగమప విన్నర్‌ యశస్వి కొండెపూడి మోసం.. స్పందించిన స్వచ్చంద సంస్థ

Published on Wed, 02/08/2023 - 19:04

యశస్వి కొండెపుడి.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సరిగమప సింగింగ్‌ షోలో లైఫ్‌ ఆఫ్ రామ్‌ పాట పాడి ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయ్యాడు. ఆ సమయంలో ఎక్కడ చూసిన యశస్వి పాటనే మారుమోగింది. ఆ సీజన్‌ సరిగమప సింగింగ్‌ ఐకాన్‌ విన్నర్‌గా టైటిల్‌ కూడా గెలిచాడు. తాజాగా యశస్వి వివాదంలో చిక్కుకున్నాడు. తనది కాని సంస్థను తనదని చెప్పుకుని మోసానికి పాల్పడ్డాడు. తాను చేయని సామాజిక సేవ గురించి తప్పుడు ప్రచారం చేసుకున్నాడు. తాజాగా అతడి బాగోతాన్ని నవసేవ పౌండేషన్‌ నిర్వహకురాలు ఫరా కౌసర్‌ బట్టబయలు చేశారు.

చదవండి: షణ్ముఖ్‌తో హగ్‌లు, ముద్దులు.. శ్రీహాన్‌ ముందు సిరి కన్నీళ్లు!

కాగా ఇటీవల ఓ షోలో పాల్గొన్న యశస్వి తాను నవసేవ అనే పేరుతో ఎన్జీవో నడుపుతున్నానని, దీని ద్వారా 50 నుంచి 60 మంది పిల్లలను చదివిస్తున్నట్లు చెప్పాడు. అయితే.. ఇది నిజం కాదని ఆ సంస్థ నిర్వాహకురాలు ఫరా కౌసర్‌ తాజాగా ఆరోపణలు చేస్తున్నారు. బుధవారం ఆమె సోమాజిగూడ ప్రెస్ క్లబ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను చేయని సేవా కార్యక్రమాలను చేసినట్లుగా ఓ టీవీ ఛానల్‌లో యశస్వి ప్రచారం చేశాడని చెప్పారు. నవసేవ అనే పేరుతో గత ఐదేళ్లుగా స్వచ్ఛంద సంస్థను స్థాపించి 56 మంది అనాథ పిల్లలను తానే చదివిస్తున్నానని చెప్పారు. కానీ ఓ ఛానల్లో పాటలు పాడిన యశస్వి ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందేందుకు సదరు కార్యక్రమం ఓట్లు రాబట్టేందుకు తాను చేయని సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకున్నారని ఆమె మండిపడ్డారు.

చదవండి: ‘తొలిప్రేమ’ హీరోయిన్‌ కీర్తి రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉంది, ఏం చేస్తుందో తెలుసా?

అది తెలిసి వెంటనే తానే స్వయంగా యశస్విని క్షమాపణ చెప్పాలని కోరిన అతడు పట్టించుకోలేదు. ప్రేక్షకుల నుంచి అభిమానం పొందేందుకు చేయని సేవా కార్యక్రమాలను తామే చేస్తున్నట్లు ఎలా ప్రచారం చేసుకుంటారని నిలదీశారు. ఈ విషయంపై తాను ప్రచారం చేసిన టీవీ ఛానల్, సదరు కార్యక్రమానికి వ్యాఖ్యాతక వ్యవహరించిన యాంకర్‌పై, యసస్విపై త్వరలోనే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు. కాగా సరిగమప సింగింగ్‌ షో తెచ్చిన పెట్టిన పాపులారిటితో యశస్వి సెలబ్రెటి అయిపోయాడు. అదే క్రేజ్‌తో అతడు పలు ఈవెంట్స్‌లో తన గాత్రంతో అలరిస్తూ ఎన్నో షోలు చేస్తూ బిజీగా మారాడు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)