Breaking News

నా కెరీర్‌లో సర్దార్‌ 2 చాలా ముఖ్యం: కార్తీ

Published on Tue, 09/08/2026 - 01:39

‘‘నా కెరీర్‌లో ‘సర్దార్‌ 2’ కచ్చితంగా చాలా ముఖ్యమైన సినిమా. ఇలాంటి ఒక గూఢచారి పాత్ర దొరకడం నా అదృష్టం. ‘సర్దార్‌ 2’ సినిమా విజయంపై నాకు  నమ్మకం ఉంది. ప్రేక్షకుల స్పందన కోసం వేచి చూస్తున్నాను’’ అని కార్తీ అన్నారు. పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో కార్తీ హీరోగా నటించిన చిత్రం ‘సర్దార్‌ 2’. మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్‌ హీరోయిన్లుగా నటించారు. ఎస్‌జే సూర్య విలన్‌ పాత్రపోషించారు. ప్రిన్స్ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఎస్‌. లక్ష్మణ్‌ కుమార్‌ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 10న విడుదల అవుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్‌ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తోంది. 

సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో  కార్తీ మాట్లాడుతూ–‘‘కమల్‌హాసన్‌గారికి ‘ఇండియన్‌’(తెలుగులో భారతీయుడు) సినిమా ఎలానో నాకు ‘సర్దార్‌’ అలాగ. ఈ మూవీ తెలుగులోనూ చాలా పెద్ద హిట్‌ అయింది. ఆ మూవీ చూడని వారు ఓ సారి ఓటీటీలో చూసి ‘సర్దార్‌ 2’ కి రావాల్సిందిగా కోరుతున్నాను. 

ఈ చిత్రాన్ని ఇంత గ్రాండ్‌కి తెరకెక్కించిన మా నిర్మాతలు లక్ష్మణ్, వెంకటేశ్‌గార్లకు, విడుదల చేస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్‌ నాగార్జునగారికి, సుప్రియగారికి, 
శ్రీధర్‌గారికి ధన్యవాదాలు’’ అన్నారు. 

హీరో అడివి శేష్‌ మాట్లాడుతూ–‘‘కార్తీసర్‌ అంటే నాకు చాలా ఇష్టం. నా ఆల్‌టైమ్‌ ఫేవరేట్‌ మూవీస్‌లో ఆయన ‘ఆవారా, ఖైదీ, సర్దార్‌’ వంటి సినిమాలున్నాయి. ‘సర్దార్‌ 2’ ఘన విజయం సాధించాలి’’ అని పేర్కొన్నారు. ఈ వేడుకలో డైరెక్టర్స్‌ బోయ పాటి శ్రీను, కళ్యాణ్‌ శంకర్, అన్నపూర్ణ స్టూడియోస్‌ సాయిబాబా, నిర్మాతలు భోగవల్లి ప్రసాద్, వై.రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ, అనిల్‌ సుంకర, శ్రీధర్, హీరోయిన్లు మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్, నటుడు ఎస్‌జే సూర్య మాట్లాడారు.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)