Breaking News

నా డైరెక్షన్‌లోనే ఆ బయోపిక్‌ ఉంటుంది

Published on Sat, 10/11/2025 - 04:10

‘‘ప్రస్తుతం షూటింగ్‌ సమయంలో షాట్‌ ఓకే అయిన తర్వాత నటీనటులు వెళ్లి తాము ఎలా చేశామో అని మానిటర్‌లో చూస్తుంటారు. ప్రతిసారీ వెళ్లి మానిటర్‌ చూడటం వల్ల సమయం వృథా అని నా భావన. మానిటర్‌ చూడటం డైరెక్టర్‌ పని. ఆయనకి సన్నివేశం బాగా వచ్చిందంటే ఓకే.. లేకుంటే మరో టేక్‌ చెబుతారు’’ అని శరత్‌ కుమార్‌ తెలిపారు. ప్రదీప్‌ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించిన చిత్రం ‘డ్యూడ్‌’. కీర్తీశ్వరన్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది.

ఈ సినిమాలో కీలకపాత్ర చేసిన శరత్‌ కుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ–‘‘నెనెప్పుడూ కథలో ముఖ్య భాగమయ్యేపాత్రలు చేయడానికే ఇష్టపడతాను. డైరెక్టర్‌ కీర్తీశ్వరన్‌ ‘డ్యూడ్‌’ కథ చెప్పినప్పుడు ప్రదీప్‌కి మావయ్యపాత్ర అన్నారు. నాపాత్ర కథలో చాలా కీలకం. ఒక కుటుంబంలో ఇలాంటి ఓ ఘటన జరిగితే సమాజం ఎలా స్పందిస్తుంది? అనే కోణంలో ‘డ్యూడ్‌’ని డైరెక్టర్‌ చాలా అద్భుతంగా చూపించారు. వినోదం, భావోద్వేగాలు కొత్తగా ఉంటాయి. నాపాత్రలో డిఫరెంట్‌ షేడ్స్‌ ఉంటాయి. సెట్స్‌లో ఉన్నప్పుడు సీనియర్‌ని అనే ఆలోచనతో కాకుండా నేను కేవలం శరత్‌ కుమార్‌ అనే ఆలోచనతో ఉంటాను.

ఇంట్లో నేను, రాధిక, వరలక్ష్మి సినిమాల గురించి మాట్లాడుతుంటాం. వరలక్ష్మి ఇప్పుడు డైరెక్టర్‌ అవుతోంది. తన కథని రెండు మూడు రోజుల్లో వింటాను. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎన్నోపాత్రలు చేశాను. అయితే సుభాష్‌ చంద్రబోస్‌గారి బయోపిక్‌ చేయాలని ఉంది. ఈ సినిమాకి నేనే దర్శకత్వం వహిస్తాను. ప్రస్తుతం ‘మిస్టర్‌ ఎక్స్‌’ సినిమా చేస్తున్నాను. బాలీవుడ్‌లో ఓ మూవీ, గౌతమ్‌ మీనన్‌తో ఒక సినిమా చేస్తున్నాను’’ అని చెప్పారు.

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు