Breaking News

ఆరోగ్యకరమైన హాస్యంతో...

Published on Wed, 04/02/2025 - 02:52

‘‘సారంగపాణి జాతకం’లో నాన్‌ తెలుగు యాక్టర్లు లేరు. అందరూ తెలుగువారు నటించిన పరిపూర్ణమైన తెలుగు సినిమా ఇది. ఎవరి డబ్బింగ్‌ వాళ్లే చెప్పుకున్నారు. హీరోయిన్‌ అయిన తెలుగమ్మాయి రూపా కొడువాయూర్‌ చక్కగా నటించింది’’ అని డైరెక్టర్‌ ఇంద్రగంటి మోహనకృష్ణ చెప్పారు. ప్రియదర్శి, రూపా కొడువాయూర్‌ జంటగా నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. 

ఈ సందర్భంగా నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ– ‘‘జెంటిల్‌మన్, సమ్మోహనం’ చిత్రాల తర్వాత కృష్ణప్రసాద్‌ కాంబినేషన్లో ‘సారంగపాణి జాతకం’ నాకు మూడో సినిమా. ఆయన నన్ను నమ్ముతారు. ఆ నమ్మకం ఇద్దరి మధ్య కొనసాగుతోంది. అన్ని వయసుల వారికి వినోదాన్ని అందించే ఆరోగ్యకరమైన హాస్యభరిత సినిమా ఇది. ఈ సినిమా చూసేటప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లల కళ్లకు, చెవులకు చేతులు అడ్డు పెట్టాల్సిన అవసరం లేదు’’ అన్నారు. 

శివలెంక కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘ఇది జాతకాల మీద తీసిన సినిమా. నేను భగవంతుణ్ణి, జాతకాలని నమ్ముతాను. ఇలాంటి సినిమా చేసినందుకు గర్వపడుతున్నాను’’ అని చెప్పారు. ‘‘ఇంద్రగంటిగారి దర్శకత్వంలో నటించాలన్న నా కల ‘సారంగపాణి జాతకం’తో నెరవేరింది’’ అన్నారు ప్రియదర్శి. ‘‘ఇంద్రగంటిగారి సినిమాలో నటించడం నాకు ఎప్పుడూ స్పెషల్‌’’ అన్నారు శ్రీనివాస్‌ అవసరాల.

 ‘‘నాకు ఇష్టమైన డైరెక్టర్‌ ఇంద్రగంటిగారు అని ఓ ఇంటర్వ్యూలో చెప్పాను. ఊహించని విధంగా ఆయన సినిమాలో నటించే చాన్స్‌ రావడం చాలా సంతోషాన్ని కలిగించింది’’ అని పేర్కొన్నారు రూపా కొడువాయూర్‌. సినిమాటోగ్రాఫర్‌ పీజీ విందా, నటీనటులు సమీరా భరద్వాజ్, నివితా మనోజ్, అశోక్‌కుమార్, ప్రదీప్, వడ్లమాని శ్రీనివాస్‌ మాట్లాడారు.

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)