Breaking News

పొలిటీషియన్‌ కొడుకుతో హీరోయిన్‌?

Published on Fri, 11/01/2024 - 07:54

బాలీవుడ్‌లో డేటింగ్‌ రూమర్స్‌ సర్వసాధారణం. పలానా హీరో, హీరోయిన్లు ప్రేమలో ఉన్నారంటూ రోజుకో పుకారు పుట్టుకొస్తూనే ఉంటుంది. ఇక హీరోయిన్ల గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఏ సెలెబ్రిటీతో అయినా కలిసి ఫోటో దిగితే చాలు..వాళ్లిద్దరు డేటింగ్‌ చేస్తున్నారంటూ కథనాలు పుట్టుకొస్తాయి. వాటిల్లో కొన్ని నిజమైన సందర్భాలూ ఉన్నాయి. ఇక ఈ సారి సైఫ్‌ అలీఖాన్‌ ముద్దుల కూతురు, హీరోయిన్‌ సారా అలీఖాన్‌పై డేటింగ్‌ రూమర్స్‌ వచ్చాయి.

పొలిటిషీయన్‌ కొడుకుతో ప్రేమాయణం
సారా అలీఖాన్‌ ప్రేమలో పడిందని బాలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది. ప్రముఖ మోడల్‌ అర్జున్‌ ప్రతాప్‌ బజ్వాతో సారా గత కొన్నాళ్లుగా సన్నిహితంగా ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. అర్జున్‌కి రాజకీయ నేపథ్యం కూడా ఉంది. పంజాబ్‌కి చెందిన బీజేపీ నేత ఫతే జంగ్ సింగ్ బజ్వా  కొడుకు ఈయన. అర్జున్‌ మినహా ఫ్యామిలీ మొత్తం రాజకీయాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది.

అలా మొదలైంది..
ఇటీవల సారా కేదార్‌నాథ్ పర్యటనకు వెళ్లింది.ఈ పర్యటననే డేటింగ్‌ రూమర్లకి కారణమైంది. సారాతో పాటు అర్జున్‌ కూడా కేదార్‌నాథ్‌ పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తుంది. ఈ పర్యటనలోనే వీరిద్దరు మరింత క్లోజ్‌ అయినట్లు తెలుస్తోంది.వీరిద్దరు కలిసి దర్శనం చేసుకుంటున్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. అప్పటి నుంచి అర్జున్‌-సారా డేటింగ్‌లో ఉన్నారనే రూమర్స్‌ మొదలైయ్యాయి. అయితే ఈ డేటింగ్‌ రూమర్స్‌పై అటు సారా కానీ, ఇటు అర్జున్‌ కానీ స్పందించలేదు. (చదవండి: మరోసారి తల్లయిన హీరోయిన్.. బేబీ బంప్స్ ఫొటోలు)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)