స‌ప్త సాగ‌రాలు దాటి సైడ్‌-బి టీజర్‌.. సినిమా రిలీజ్‌ ఎప్పుడంటే

Published on Sat, 10/28/2023 - 14:38

రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘స‌ప్త సాగ‌రాలు దాటి’. మొదట కన్నడలో విడుదలైన ఈ సినిమా సెప్టెంబర్‌ 22న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీలోనూ ఇది అందుబాటులోకి వచ్చింది. మనసుకు హత్తుకునే ప్రేమకథగా ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన మేర కలెక్షన్లు వసూలు చేయలేకపోయినా మంచి కంటెంట్‌ ఉన్న సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది.

చేయని నేరాన్ని తన మీద వేసుకుని ఓ యువకుడు జైల్లో పడటం ఆసమయంలో అతను పడే వేదనను ఈ సినిమాలో దర్శకుడు అద్భుతంగా చూపించారు. అదే సమయంలో ఆ యువకుడిని బయటకు తీసుకొచ్చేందుకు అతడి ప్రేయసి పడే కష్టాన్ని కూడా బాగా ఎమోషనల్​గా చూపించారు. పార్ట్‌-1 అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతుంది.

మొదటి భాగానికి మంచి రెస్పాన్స్‌ రావడంతో రెండో పార్ట్‌ రిలీజ్‌పై మేకర్స్‌ ప్రకటన ఇచ్చారు. 'సప్త సాగరాలు దాటి - సైడ్ బి' రిలీజ్​కు రెడీ అయింది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీటీమ్​ రిలీజ్ డేట్​తో పాటు టీజర్​ను విడుదల చేసింది. నవంబర్ 17న చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. దీనికి హేమంత్ ఎం రావు దర్శకత్వం వహించగా.. ప‌విత్ర లోకేశ్‌, అవినాష్‌, అచ్యుత్ కుమార్‌లు కీలక పాత్రల్లో కనిపించారు. 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)