Breaking News

కుక్కూ కుక్కూ పాటకు 487 మిలియన్ల వ్యూస్‌.. కానీ ఒక్క పైసా..!

Published on Thu, 03/07/2024 - 12:55

సంగీత దర్శకుడు సంతోష్‌ నారాయణన్‌.. తమిళం, తెలుగు తదితర భాషా చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూ బహుళ ప్రాచుర్యం పొందారు. ఈయన దర్శకుడు పా.రంజిత్‌ చిత్రాలకు సంగీతాన్ని అందించి వెలుగులోకి వచ్చారు. అలా వీరి కాంబినేషన్‌లో అట్టకత్తి, కాలా, కబాలి వంటి పలు చిత్రాలు రూపొందాయి. అయితే ఇటీవల వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయనే ప్రచారం వైరల్‌ అయ్యింది.

ఫేమస్‌ సాంగ్‌..
ఇటీవలే చైన్నెలో సంగీత కచేరిని భారీ ఎత్తున నిర్వహించిన సంతోష్‌ నారాయణన్‌ పలు ప్రైవేట్‌ ఆల్బమ్‌లను రూపొందించారు. అలా ఆయన సంగీతాన్ని అందించిన ప్రైవేట్‌ పాట ఎంజాయ్‌ ఎన్‌సామి.. 2021లో విడుదలవగా బాగా పాపులర్‌ అయ్యింది. ఎంతగా అంటే యూట్యూబ్‌ ఛానల్‌లో ఇప్పటి వరకూ 487 మిలియన్లకు పైగా వ్యూస్‌ను, 5 మిలియన్‌ లైక్స్‌ను పొందింది. అది సరే ఇప్పుడెందుకు దీని గురించి చెబుతున్నారు? అనిపిస్తోందా? దీనికి కారణం సంగీత దర్శకుడు సంతోష్‌ నారాయణన్‌నే.

ఇప్పటివరకు ఎక్కడా చెప్పలే..
ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్‌ చేశారు. అందులో ఎంతో పాపులర్‌ అయిన ఎంజాయ్‌ ఎన్‌. సామి (కుక్కూ కుక్కూ..) పాట నిమిత్తం తనకు ఇప్పటి వరకూ ఒక్క పైసా ఆదాయం రాలేదని, అంతా ఆ పాటను తెరకెక్కించిన మ్యూజిక్‌ సంస్థకే చేరిందని పేర్కొన్నారు. ఈ విషయం గురించి తాను ఇప్పటి వరకూ ఎక్కడా చెప్పలేదని, ఇప్పుడు చెప్పాలనిపించిందన్నారు. కాగా ప్రస్తుతం సంగీత కళాకారులకంటూ ప్రైవేట్‌ పాటల కోసం ఒక ప్లాట్‌ఫామ్‌ అవసరం ఉందని, అందుకే తాను ఒక మ్యూజిక్‌ స్టూడియోను ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇకపై సంగీత కళాకారులు బాధ పడాల్సిన అవసరం ఉండదని, మీకు చేరాల్సింది కచ్చితంగా చేరుతుందని సంతోష్‌ నారాయణన్‌ పేర్కొన్నారు.

చదవండి: మా అత్తమ్మే నాకు స్ఫూర్తి : రాంచరణ్‌ సతీమణి ఉపాసన

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)