Breaking News

సంక్రాంతి బాక్సాఫీస్: సర్‌ప్రైజ్ హిట్ కోసం ఎదురుచూపులు

Published on Thu, 01/08/2026 - 22:57

సంక్రాంతి పండగ అంటే తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకమైన ఉత్సాహం. అందుకే ఎన్ని సినిమాలు వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో దర్శక, నిర్మాతలు పండగకి వారి సినిమాలు విడుదల చేయడానికి ఇష్టపడతారు. గతంలో శతమానం భవతి, ఎక్స్‌ప్రెస్ రాజా, హనుమాన్ వంటి సినిమాలు తక్కువ అంచనాలతో వచ్చి భారీ విజయాలు సాధించిన ఉదాహరణలు ఉన్నాయి. అందుకే ఈ ఏడాది కూడా అలాంటి సర్‌ప్రైజ్ హిట్ ఏదైనా వస్తుందా అనే ఆసక్తి పెరిగింది.  

రాజాసాబ్ ఇప్పటికే పలు ప్రాంతాల్లో థియేటర్లలోకి వచ్చి మంచి హైప్ సృష్టిస్తోంది. మన శంకరవరప్రసాద్ భారీ అంచనాలతో రిలీజ్ అవుతున్న మరో పెద్ద సినిమా. అనగనగా ఒక రాజు మోస్తరు అంచనాలతో వస్తోంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారి తక్కువ అంచనాలతో రిలీజ్ అవుతున్న సినిమాలు.  

శర్వానంద్ కెరీర్‌లో శతమానం భవతి, ఎక్స్‌ప్రెస్ రాజా మాత్రమే కాదు, ఒకే ఒక జీవితం కూడా సైలెంట్‌గా వచ్చి విజయాన్ని సాధించింది. అందుకే నారీ నారీ నడుమ మురారి సినిమాను తక్కువ అంచనా వేయడం సరికాదు. రవితేజ వరుస ఫ్లాపుల కారణంగా ఈసారి అంచనాలు తగ్గాయి. అయినప్పటికీ సంక్రాంతి బరిలో ఆయన సినిమా ఏదైనా మేజిక్ చేస్తుందేమో అనే ఆసక్తి ఉంది.  

ఈ ఏడాది రెండు పెద్ద సినిమాలు, మూడు మిడ్ రేంజ్ సినిమాలు కలిపి బాక్సాఫీస్‌ను రంజుగా మార్చాయి. రాజాసాబ్‌తో సంక్రాంతి సినిమా పండగ మొదలైంది. ఇంకో వారం రోజుల్లో ఎవరు నిజమైన సంక్రాంతి హీరో అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. మొత్తానికి 2026 సంక్రాంతి బాక్సాఫీస్ రేసు ప్రేక్షకులకు భలే ఆసక్తికరంగా మారింది. ఒక వైపు పెద్ద సినిమాలు తమ స్థాయిలో పోటీ పడుతుంటే, మరోవైపు చిన్న సినిమాలు సర్‌ప్రైజ్ హిట్ ఇవ్వగలవా అనే ఉత్కంఠను ప్రేక్షకులకు రేపాయి.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)