Breaking News

'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ సాంగ్‌ రికార్డ్‌

Published on Thu, 03/06/2025 - 12:55

హీరో వెంకటేశ్‌తో పాటు మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్‌ లీడ్‌ రోల్స్‌లో నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. అయితే, ఈ మూవీకి భారీ బజ్‌ క్రియేట్‌ చేసిన ఒక సాంగ్‌ ఇప్పటికీ నెట్టింట వైరల్‌ అవుతూనే ఉంది. ‘దిల్‌’ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మించి ఈ చిత్రం జనవరి 14న విడుదలైంది. బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ. 310 కోట్లకు పైగానే రాబట్టింది. వెంకీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఇప్పటికే ఈ చిత్రం 92 కేంద్రాల్లో 50రోజులు పూర్తి చేసుకుంది.

అయితే, సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలోని ‘గోదారి గట్టు మీద రామచిలకవే... గోరింటాకెట్టుకున్న చందమామవే..!’ అంటూ సాగే ఆ పాట సినిమాకు ప్రధాన బలమైంది. ఇప్పటి వరకు ఈ లిరికల్‌ వీడియో సాంగ్‌ 200 మిలియన్ల వ్యూస్‌ సాధించి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. టాలీవుడ్‌లో తక్కువ సమయంలోనే ఈ మార్క్‌ అందుకున్న పాటగా  రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. గతంలో కేవలం మూడు వారాల్లోనే 50 మిలియన్ల వ్యూస్‌ సాధించి రికార్డ్‌ క్రియేట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ సాంగ్‌కు భాస్కరభట్ల సాహిత్యం అందించగా.. సుమారు 18 ఏళ్ల తర్వాత రమణగోగుల ఆలపించడం విశేషం. ఫిమేల్‌ లిరిక్స్‌ను మధుప్రియ కూడా చాలా అద్భుతంగా పాడింది.  భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించారు.

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే, తాజాగా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్‌ అవుతుంది.  థియేటర్‌లో 2 గంటలా 24 నిమిషాలు ప్రదర్శితమవగా..  జీ5లో కేవలం 2 గంటలా 16 నిమిషాల నిడివితో సినిమాను ఉంచారు. దాదాపు ఎనిమిది నిమిషాల సీన్స్ తొలగించారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)