సంక్రాంతికి వస్తున్నాం మూవీ అరుదైన ఘనత!

Published on Fri, 11/07/2025 - 17:57

అనిల్ రావిపూడి- వెంకీ కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఏడాది సంక్రాంతికి కానుకగా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ మూవీ అరుదైన ఘనత సొంతం చేసుకుంది.

సినీరంగంలో అందించే ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకలకు ఎంపికైంది. ఈ నెల 20న గోవాలో జరగనున్న ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా(IFFI) అవార్డుల వేడుకలో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. ఇండియన్ పనోరమ(ఫీచర్ ఫిల్మ్స్‌) విభాగంలో అఫీషియల్‌గా ఎంపికైంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. టాలీవుడ్‌లో సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేసిందని మేకర్స్ ట్వీట్ చేశారు.

అంతేకాకుండా ఇవాళ పలు అవార్డులకు నామినేట్‌ వారి జాబితాను నిర్వాహకులు వెల్లడించారు. దీంతో పాటు ఉత్తమ డెబ్యూ డైరెక్టర్‌ విభాగంలో టాలీవుడ్‌ డైరెక్టర్‌ యదు వంశీ నామినేట్‌ అయ్యారు. కమిటీ కుర్రోళ్లు చిత్రానికిగానూ ఆయనకు నామినేషన్‌ దక్కింది. ఇదే విభాగంలో.. మలయాళం నుంచి జితిన్‌లాల్‌ (ఎ.ఆర్‌.ఎం), హిందీ నుంచి కరణ్‌ సింగ్‌త్యాగి (కేసరి చాప్టర్‌ 2) బెంగాలీ నుంచి రామ్‌ కమల్‌ ముఖర్జీ (బినోదిని)పోటీపడుతున్నారు.

Videos

Hyd: సెప్టెంబర్ లోనూ ఇంతే.. వర్షాలపై IMD హెచ్చరిక

తెలంగాణ బీజేపీ నేతల అరెస్ట్..!

మాట ఇచ్చి తప్పింది మీరు మమల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు..?

అమెరికా రక్షణ శాఖలో తీవ్ర కలకలం!

AP: రైతులంటే ఎందుకు మీకు అంత కక్ష..?

నేపాల్ వరదల్లో చిక్కుకున్న బాధిత ఫ్యామిలీ ఆవేదన

మంత్రి పదవి ఊస్ట్ హుటాహుటిన ఢిల్లీకి కొండా సురేఖ

రాజమండ్రి సెంట్రల్ జైలుకు సాధిక్ ఖాన్ తరలింపు

Hyderabad: దొంగలు బాబోయ్ దొంగలు

Kadapa : YSRకు వైఎస్ జగన్ ఘన నివాళి

Photos

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)