Breaking News

సంక్రాంతి రేసులో మూడు సినిమాలు.. ఏపీలో టికెట్‌ ధరలు పెంపు

Published on Sun, 01/05/2025 - 07:50

కొత్త ఏడాది ప్రారంభంలోనే మూడు టాప్‌ సినిమాలు విడుదల కానున్నాయి.  రామ్‌ చరణ్‌  (గేమ్‌ ఛేంజర్‌), బాలకృష్ణ (డాకు మహారాజ్‌), వెంకటేశ్‌ (సంక్రాంతికి వస్తున్నాం) వంటి సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద పోటీ పడనున్నాయి.  అయితే, ఏపీలో ఈ చిత్రాలకు టికెట్‌ ధరలు పెంచుకునే సౌలభ్యం ప్రభుత్వం కల్పించింది. బెనిఫిట్‌ షోలతో పాటు అదనపు ఆటలకు అనుమతి ఇస్తూ ఏపీ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది.

గేమ్‌ ఛేంజర్‌ టికెట్‌ ధరలు ఇలా
రామ్‌ చరణ్‌- శంకర్‌ కాంబినేషన్‌లో నిర్మాత దిల్‌ రాజ్‌ భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రాన్ని నిర్మించారు. జనవరి 10న తెల్లవారుజామున ఒంటిగంటకు బెనిఫిట్‌ షో వేసుకోవచ్చని ఏపీ ప్రభుత్వం తెలిపింది. దీనికి ఒక్కో టికెట్‌ ధర రూ.600గా నిర్ణయించింది. అయితే, మొదటి రోజు 4గంటల ఆట నుంచి టికెట్‌ ధరలు ఇలా ఉండనున్నాయి. ప్రస్తుతం ఉన్న టికెట్‌ ధరలపై అదనంగా మల్టీప్లెక్స్‌లో రూ.175, సింగిల్‌ థియేటర్స్‌లలో రూ.135 వరకు పెంచుకోవచ్చని చెప్పింది. ఫస్ట్‌ డే నాడు ఆరు షోలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. 11వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ రోజుకు 5 షోలు ఉండనున్నాయి. పెంచిన ధరలు 23వ తేదీ వరకు ఉంటాయి.

 'డాకు మహారాజ్‌' టికెట్‌ ధరలు
నందమూరి బాలకృష్ణ- బాబీ సినిమా 'డాకు మహారాజ్‌'. ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మించారు. జనవరి 12న విడుదల కానున్న మూవీకి  బెనిఫిట్‌ షోలతో పాటు టికెట్‌ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది.  12వ తేదీ ఉదయం 4 గంటల ప్రత్యేక షో  కోసం అనుమతితో పాటు ఒక్కో టికెట్‌ రూ.500కు విక్రయించేందుకు అనుమతిచ్చింది. రోజుకు ఐదు షోలతో పాటు  ప్రస్తుతం ఉన్న టికెట్‌ ధరలపై అదనంగా  మల్టీప్లెక్స్‌లో రూ.135, సింగిల్‌ థియేటర్స్‌లలో రూ.110 వరకు పెంచుకోవచ్చని చెప్పింది. జనవరి 23 వరకు ఈ ధరలు ఉంటాయి.

సంక్రాంతికి వస్తున్నాం టికెట్‌ ధరలు
వెంకటేశ్‌- అనిల్‌ రావిపూడి హిట్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. దిల్‌ రాజు నిర్మించిన  ఈ మూవీ జనవరి 14న విడుదల కానుంది.  రోజుకు ఐదు షోలు నిర్వహించుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి కల్పించింది.  ప్రస్తుతం ఉన్న టికెట్‌ ధరలపై అదనంగా  మల్టీప్లెక్స్‌లో రూ.125, సింగిల్‌ థియేటర్స్‌లలో రూ.100 వరకు పెంచుకోవచ్చని చెప్పింది. జనవరి 28 వరకు ఈ ధరలు ఉంటాయి.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)