Breaking News

సంక్రాంతి ప్రత్యేకం 

Published on Thu, 01/16/2025 - 04:33

తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగతో చిత్ర పరిశ్రమకు ప్రత్యేక అనుబంధం ఉంది. సంక్రాంతి సందర్భంగా తమ సినిమాలను రిలీజ్‌ చేసేందుకు స్టార్‌ హీరోలు సైతం పోటీపడుతుంటారు. ఈ సంక్రాంతికి రామ్‌చరణ్‌ ‘గేమ్‌ చేంజర్‌’, బాలకృష్ణ ‘డాకు మహారాజ్‌’, వెంకటేశ్‌ ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బిగ్‌ ప్రాజెక్ట్స్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. సంక్రాంతి పండుగని పురస్కరించుకుని తమ సినిమాల నుంచి ప్రత్యేక పోస్టర్స్, లుక్స్‌ని విడుదల చేశారు పలువురు మేకర్స్‌. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం... 

రాజా సాబ్‌ ఆగయా
ప్రభాస్‌ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘రాజా సాబ్‌’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్‌ హీరోయిన్లు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. రొమాంటిక్‌ హారర్‌ జానర్‌లో రూపొందుతోన్న ‘రాజా సాబ్‌’ నుంచి ప్రభాస్‌ సరికొత్త పోస్టర్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌. పండుగ కళ కనిపిస్తున్న ఈ పోస్టర్‌లో ప్రభాస్‌ లుక్‌ ఆకట్టుకుంటోంది. షూటింగ్‌ తుదిదశలో ఉన్న ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

అందమైన లైలా
హీరో విశ్వక్‌ సేన్‌ లైలాగా మారారు. ఆయన అబ్బాయిగా, అమ్మాయిగా నటించిన చిత్రం ‘లైలా’. రామ్‌ నారాయణ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఆకాంక్షా శర్మ హీరోయిన్‌. షైన్‌ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ మూవీలో తొలిసారి లైలా అనే అమ్మాయి పాత్రలో కనిపించనున్నారు విశ్వక్‌ సేన్‌. ఈ సినిమా నుంచి లైలాగా విశ్వక్‌ సేన్‌ లుక్‌ని రిలీజ్‌ చేసింది చిత్రయూనిట్‌.  

జాస్మిన్‌ వచ్చేశారు
‘బబుల్‌ గమ్‌’ మూవీ ఫేమ్‌ రోషన్‌ కనకాల హీరోగా నటిస్తున్న చిత్రం ‘మోగ్లీ 2025’. ‘కలర్‌ ఫోటో’ మూవీతో జాతీయ అవార్డు అందుకున్న సందీప్‌ రాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్‌ , టీజీ కృతి ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా సాక్షి సాగర్‌ మదోల్కర్‌ హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో ఆమె జాస్మిన్‌ పాత్రలో నటిస్తున్నట్లు పేర్కొని, పోస్టర్‌ని విడుదల చేశారు మేకర్స్‌.  

సంతానప్రాప్తిరస్తు
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన సినిమా ‘సంతానప్రాప్తిరస్తు’. సంజీవ్‌ రెడ్డి దర్శకత్వంలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్‌ రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా నుంచి విక్రాంత్, చాందినిల స్పెషల్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేసింది యూనిట్‌. ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. 
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)