Breaking News

రాజా సాబ్‌ సెట్‌లో తెలుగు నేర్చుకుంటున్నాను : సంజయ్‌ దత్‌

Published on Sat, 07/12/2025 - 12:48

‘‘వెంకీ సార్, సుప్రీత్‌లకు సినిమా పట్ల ఎంతో ప్యాషన్‌ ఉంది.  అందుకే ‘కేడీ: ది డెవిల్‌’ని గొప్పగా నిర్మించారు. ధృవ నా తమ్ముడులాంటివారు. శిల్పా శెట్టితో ఎప్పుడు పని చేసినా అదే ఎనర్జీ ఉంటుంది. మా ‘కేడీ: ది డెవిల్‌’ సినిమాకి విజయం అందించాలి’’ అని సంజయ్‌ దత్‌ పేర్కొన్నారు. ధృవ సర్జా హీరోగా, రీష్మా నానయ్య హీరోయిన్‌గా ప్రేమ్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘కేడీ: ది డెవిల్‌’. సంజయ్‌ దత్, శిల్పా శెట్టి, నోరా ఫతేహి ముఖ్య పాత్రలు పోషించారు. వెంకట్‌ కె. నారాయణ నిర్మించిన ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరిగింది. 

సంజయ్‌ దత్‌ మాట్లాడుతూ– ‘‘హైదరాబాద్‌తో నాకెంతో అనుబంధం ఉంది. ఎంతో మందితో కలిసి పని చేశాను. ప్రస్తుతం ప్రభాస్‌ ‘రాజా సాబ్‌’ సినిమా చేస్తున్నాను. ఆ సెట్‌లో తెలుగు నేర్చుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. ధృవ సర్జా మాట్లాడుతూ–‘‘సంజయ్‌ దత్, శిల్పా శెట్టి వంటి వారితో పని చేయడం సంతోషంగానే ఉంటుంది. త్వరలో విడుదల కానున్న మా సినిమాని ఆదరించాలని కోరు కుంటున్నాను’’ అన్నారు. 

‘‘మా సినిమా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను’’ అని నమ్మకం వ్యక్తం చేశారు ప్రేమ్‌. శిల్పా శెట్టి మాట్లాడుతూ– ‘‘నేను నా తొలి చిత్రం హిందీలో కాకుండా తెలుగులో (సాహసవీరుడు సాగరకన్య) చేశాను. ఇప్పుడు చేసిన ఈ ‘కేడీ: ది డెవిల్‌’లో అన్ని వాణిజ్య అంశాలున్నాయి.. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు. హీరోయిన్‌ రీష్మా నానయ్య, కేవీఎన్‌ ్ర΄÷డక్షన్‌ బిజినెస్‌ హెడ్‌ సుప్రీత్‌ మాట్లాడారు.   

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)