Breaking News

ప్రభాస్ ది రాజాసాబ్‌తో బాక్సాఫీస్ క్లాష్.. ఆ పని చేయరనుకుంటున్నా: కేజీఎఫ్ నటుడు

Published on Thu, 07/10/2025 - 17:59

ప్రభాస్ నటిస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం ది రాజాసాబ్‌. ఈ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, రిద్ధి కుమార్‌, మాళవిక మోహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సలార్, కల్కి వస్తోన్న సినిమా కావడంతో  అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుందని వెల్లడించారు.

అయితే తాజాగా రణ్‌వీర్ సింగ్‌ నటిస్తోన్న యాక్షన్‌ థ్రిల్లర్‌ దురంధర్‌ మూవీ ఫస్ట్ లుక్ రివీల్‌ చేశారు. ఈ సినిమాను కూడా ది రాజాసాబ్‌ రిలీజ్ రోజునే రానుందని మేకర్స్ ప్రకటించారు. ఫస్ట్ లుక్ వీడియోతో పాటు విడుదల తేదీని కూడా వెల్లడించారు. దీంతో బాక్సాఫీస్ వద్ద ది రాజాసాబ్‌తో రణ్‌వీర్‌ సింగ్‌ పోటీపడడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ రెండు చిత్రాల బాక్సాఫీస్ క్లాష్‌పై కేజీఎఫ్ నటుడు సంజయ్ దత్ స్పందించారు. తాజాగా తాను నటించిన కేడీ ది ముంబయి డెవిల్ మూవీ టీజర్‌ లాంఛ్‌ ఈవెంట్‌లో ఎదురైన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. దురంధర్‌, ది రాజాసాబ్‌ అదే రోజు రిలీజ్ కావడంపై సంజయ్ దత్ మాట్లాడారు.

సంజయ్ దత్ మాట్లాడుతూ..' ఈ రెండు సినిమాలు చాలా డిఫరెంట్‌. ది రాజాసాబ్, దురంధర్‌ చిత్రాల్లో నా రోల్స్ చాలా భిన్నమైనవి. ఈ రెండు సినిమాలు ఓకే రోజు విడుదల అవ్వడం నాకు ఇష్టం లేదు. వాళ్లు కూడా ఈ పని చేయరని అనుకుంటున్నా' అని పంచుకున్నారు. 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి