Breaking News

'డబుల్‌ ఇస్మార్ట్‌' కోసం బిగ్‌ బుల్‌ను దించిన పూరీ జగన్నాథ్‌

Published on Sat, 07/29/2023 - 11:08

పూరీ జగన్నాథ్‌ - రామ్ పోతినేని కాంబోలో 'డబుల్‌ ఇస్మార్ట్‌'  తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచి దీనికి సంబంధించిన వార్త ఏదో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటుంది.  'లైగర్‌'తో దెబ్బతిన్న పూరీ 'డబుల్‌ ఇస్మార్ట్‌' కోసం పక్కా ప్లాన్‌తో అడుగులు వేస్తున్నాడు. అందులో భాగంగానే ఈ సినిమాలో కీలక పాత్ర కోసం బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సంజయ్‌ దత్‌ను తీసుకున్నారు. ఇదే విషయాన్ని చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది.

(ఇదీ చదవండి: సౌత్‌ ఇండియాలో రిచ్చెస్ట్‌ హీరో ఆయనే.. ఆస్తులు ఎన్ని వేల కోట్లంటే)

ఇక సంజయ్ దత్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కుడా రిలీజ్ చేశారు. అందులో  సిగరెట్ తాగుతూ సంజయ్ దత్ కనిపిస్తుండగా ఆయనపై గన్స్ అన్నీ పాయింట్‌ చేసి ఉన్నాయి. ఇందులో 'బిగ్ బుల్'గా సంజయ్ దత్‌ కనిపిస్తారని మేకర్స్‌ తెలిపారు. గతంలో కేజీఎఫ్‌ 2లో అధీర పాత్రలో ఆయన మెప్పించిన విషయం తెలిసిందే. ఈ మూవీపై సంజయ్‌ కూడా ట్వీట్‌ చేశాడు. డైరెక్టర్ పూరిజగన్నాధ్,  రామ్ పోతినేనితో కలిసి పనిచేయడం గర్వంగా ఉందని ఆయన తెలిపాడు. ఈ సైన్స్ ఫిక్షన్ మాస్ ఎంటర్‌టైనర్‌లో తాను భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందంటూ సంజయ్ పేర్కొన్నాడు.

(ఇదీ చదవండి: శోభన ఇంట్లో చోరీ.. పనిమనిషి వేడుకోవడంతో ఆమె నిర్ణయానికి ఫ్యాన్స్‌ ఫిదా)

ఇక 2019లో వచ్చిన 'ఇస్మార్ట్‌ శంకర్‌'కు సీక్వెల్‌గా రానున్న ఈ సినిమాలో రామ్‌కు జోడిగా మీనాక్షి చౌదరి కనిపించనుందని వార్తలు వస్తున్నాయి. పూరీ సొంత నిర్మాణంలో ఛార్మీతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Videos

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్..!

విజయవాడ పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన

కేసీఆర్ ఫాంహౌస్ వద్ద 144 సెక్షన

మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!

Photos

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)