Breaking News

విజయ్‌ Vs సంజయ్‌.. మరో పాన్‌ ఇండియా సినిమా లోడింగ్‌

Published on Sun, 03/12/2023 - 09:39

నటుడు విజయ్‌ 67వ చిత్రం లియో. త్రిష నాయకిగా చేస్తున్నారు. ప్రియా ఆనంద్‌ మరో హీరోయిన్‌. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్, నటుడు అర్జున్, దర్శకుడు గౌతమ్‌మీనన్, మిష్కిన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 'విక్రమ్‌'తో సంచలన విజయం తరువాత లోకేశ్‌ కనకరాజ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం లియో. 7 స్క్రీన్‌ స్టూడియోస్‌ పతాకంపై ఎస్‌ఎస్‌ లలిత్‌కుమార్‌ నిర్మిస్తున్నారు. అనిరుథ్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే తొలి షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం కశ్మీర్‌లో రెండో షెడ్యూల్‌ జరుపుకుంటోంది. విజయ్, త్రిష, మిష్కిన్‌తో ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించారు.  

బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ లియో షూటింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈయన నటిస్తున్న తొలి తమిళ చిత్రం ఇది. అదేవిధంగా కేజీఎఫ్‌ 2 తరువాత దక్షిణాదిలో నటిస్తున్న చిత్రం. కాగా లియోలో సంజయ్‌దత్‌ ఎంట్రీ ఇచ్చిన ఫొటోలను చిత్ర యూనిట్‌ శనివారం మీడియాకు విడుదల చేసింది. ఇందులో  సంజయ్‌దత్‌ను విజయ్‌ ఢీకొనే సన్నివేశాలు బీభత్సంగా ఉంటాయని ప్రచారం జరుగుతోంది. దీంతో యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కుతున్న లియో చిత్రంపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇదివరకే రిలీజైన చిత్ర టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చింది. కాగా చిత్రాన్ని సెప్టెంబర్‌ 7వ తేదీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తు న్నట్లు సమాచారం.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)