Breaking News

అల్లు అర్జున్‌కు బెయిల్‌ మంజూరు

Published on Fri, 01/03/2025 - 17:17

సాక్షి, హైదరాబాద్‌: సంధ్య థియేటర్‌ ఘటనలో హీరో అల్లు అర్జున్‌ (Allu Arjun)కు నాంపల్లి కోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసింది. పుష్ప2 సినిమా ప్రీమియర్‌ సమయంలో సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడంతో ఆయనపై బీఎన్‌ఎస్‌ 105 సెక్షన్‌ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో నాంపల్లి కోర్టు బన్నీకి 14రోజుల రిమాండ్‌ విధించడంతో పోలీసులు ఆయన్ను జైలుకు తరలించారు.

ఆపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఒకరాత్రి జైలులో గడిపిన ఆయన మరుసటిరోజు విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే, రెగ్యులర్‌ బెయిల్‌ కోసం నాంపల్లి కోర్టును అల్లు అర్జున్‌ ఆశ్రయించారు. బెయిల్‌ ఇవ్వొద్దంటూ చిక్కడపల్లి పోలీసులు కౌంటర్‌ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలను పరిశీలించిన కోర్టు అల్లు అర్జున్‌కు రెగ్యులర్‌ బెయిల్‌ ఇస్తూ శుక్రవారం తీర్పు వెల్లడించింది. రూ.50 వేలు, రెండు పూచీకత్తులు సమర్పించాలని బన్నీని ఆదేశించింది.

ఏం జరిగింది?
డిసెంబర్‌ 4న ‘పుష్ప2’ బెనిఫిట్‌ షో సమయంలో సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి మరణించగా ఆమె కుమారుడు ఇప్పటికీ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. దీంతో వారి కుటుంబానికి అల్లు అ‍ర్జున్‌ పేరుతో అల్లు అరవింద్‌ భారీ సాయం ప్రకటించారు.  శ్రీతేజ్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ రూ. 1 కోటి సాయం ప్రకటించారు. డైరెక్టర్‌ సుకుమార్‌ రూ. 50 లక్షలు అందించగా.. మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. మొత్తం రూ. 2 కోట్ల రూపాయలు చెక్కులను తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా దిల్‌ రాజుకు చిత్ర యూనిట్‌ అందించింది.

 హీరో అల్లు అర్జున్‌ కు నాంపల్లి కోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు

చదవండి: హీరోయిన్‌ను దబిడి దిబిడి ఆడేసుకున్న బాలకృష్ణ.. ఇదేం కర్మరా సామీ!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)