Breaking News

మన తెలుగు ఆడియన్స్‌ స్పెషాలిటీ అది

Published on Fri, 11/14/2025 - 06:03

‘‘జిగ్రీస్‌’లాంటి సినిమా చేయాలంటే ఈ యూనిట్‌ అందరికీ ఒక పిచ్చి ఉండాలి. నేను ‘అర్జున్‌ రెడ్డి’ని ఎలా తీశానో అంతకంటే ఎక్స్‌ట్రీమ్‌గా ‘జిగ్రీస్‌’ చిత్రాన్ని తీశారు. దాని కోసం అయినా ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. హీరో, దర్శకుడితో సంబంధం లేకుండా ఏదో ఒక ఎలిమెంట్‌ నచ్చితే ఆడియన్స్‌ థియేటర్స్‌కు వెళ్లి సినిమా చూస్తారు. మన తెలుగు ఆడియన్స్‌ స్పెషాలిటీ అది. ‘జిగ్రీస్‌’ను కూడా ప్రేక్షకులు థియేటర్స్‌కి వెళ్లి చూడాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. కృష్ణ బూరుగుల, ధీరజ్‌ ఆత్రేయ, మణి వక్కా, రామ్‌ నితిన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జిగ్రీస్‌’. 

హరీష్‌ రెడ్డి ఉప్పుల దర్శకత్వంలో కృష్ణ వోడపల్లి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో కృష్ణ బూరుగుల మాట్లాడుతూ– ‘‘జిగ్రీస్‌’ నాకు ఒక ‘డీజే టిల్లు’, ‘జాతి రత్నాలు’. ఇది ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో చెప్పడం లేదు. నమ్మకంతో చెబుతున్నాను’’ అని పేర్కొన్నారు. ‘‘మా సినిమాను థియేటర్స్‌లో చూడండి. తప్పకుండా ఎంజాయ్‌ చేస్తారు’’ అన్నారు ధీరజ్, మణి. ‘‘ఆల్రెడీ ప్రీమియర్స్‌ వేశాం. మంచి స్పందన లభించింది’’ అని చెప్పారు హరీష్‌ రెడ్డి. ‘‘మా సినిమాను మిస్‌ కాకుండా చూడండి’’ అన్నారు నిర్మాత కృష్ణ వోడపల్లి.

Videos

బిహార్ లో NDA దిమ్మతిరిగే స్ట్రైక్ రేట్

వేధింపులకే చనిపోయారా? టీటీడీ ఉద్యోగి మృతిపై అనుమానాలు

జూబ్లీ ఫలితాలపై సంచలన ప్రెస్ మీట్

ఎన్నికల ఫలితాలపై మాగంటి సునీత ఎమోషనల్

సీఎం రేంజ్ లో సవాల్ విసిరి తుస్సుమన్న PK

బీజేపీ ఓటమిపై దీపక్ రెడ్డి ఎమోషనల్

కాంగ్రెస్ చిత్తుచిత్తు.. 200 మార్క్ వైపు దూసుకుపోతున్న NDA

రామ్ చరణ్ పెద్ది సినిమాపై క్రేజీ అప్ డేట్..

అమిత్ షా చెప్పిందే జరిగింది..

సంబరాల్లో కాంగ్రెస్ నేతలు.. స్టెప్పులేసిన వీహెచ్

Photos

+5

కాంగ్రెస్‌ ఘన విజయం.. గాంధీభవన్‌లో హస్తం నేతల సంబరాలు (ఫొటోలు)

+5

‘దేవగుడి’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశీస్సులు (ఫొటోలు)

+5

జూబ్లీహిల్స్‌లో కొనసాగుతున్న కౌంటింగ్‌.. అభ్యర్థులు, ఏజెంట్లు బిజీ (ఫొటోలు)

+5

ఫ్రెషర్స్‌ డే పార్టీ.. అదరగొట్టిన అమ్మాయిలు (ఫొటోలు)

+5

బీచ్ ఒడ్డున సంయుక్త.. ఇంత అందమా? (ఫొటోలు)

+5

భర్త బర్త్ డే.. సుమ క్యూట్ పోస్ట్ (ఫొటోలు)

+5

SSMB29 లోకేషన్‌కి ట్రిప్ వేసిన అనసూయ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ అంజలి (ఫొటోలు)

+5

లేటు వయసులో ట్రెండింగ్ అయిపోయిన గిరిజ (ఫొటోలు)