Breaking News

చాలా పెద్ద కథ అనిపించింది: డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా

Published on Wed, 10/23/2024 - 02:49

‘‘΄పొట్టేల్‌’ సినిమా చూశాను.. చాలా బాగా నచ్చింది. కథ విన్నాక ఇది చిన్న కథ కాదు చాలా పెద్ద కథ అనిపించింది. సాహిత్‌ ఇంత అద్భుతంగా తీస్తాడని ఊహించలేదు. నాకు చాలా పెద్ద బడ్జెట్‌ మూవీలా కనిపించింది. నిర్మాతలు చాలాఫ్యాషన్‌తో తీశారు. అజయ్, యువ, అనన్య, నోయల్, జీవా అందరూ సూపర్‌గా నటించారు. యువ దర్శకులు ఎవరూ ఇటీవల పూర్తి స్థాయి గ్రామీణ నేపథ్యంలో సినిమా చేయలేదనుకుంటున్నాను. ఆ నేపథ్యంలో ‘రంగస్థలం’ చిత్రం తర్వాత నేను చూసిన సినిమా ‘΄పొట్టేల్‌’. ఈ సినిమాని అందరూ ప్రోత్సహించాలి’’ అని డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా కోరారు.

 యువ చంద్రకృష్ణ, అనన్య నాగళ్ల లీడ్‌ రోల్స్‌లో నటించిన చిత్రం ‘΄పొట్టేల్‌’. సాహిత్‌ మోత్కూరి దర్శకత్వంలో నిశాంక్‌ రెడ్డి కుడితి, సురేష్‌ కుమార్‌ సడిగే నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి సందీప్‌ రెడ్డి వంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యువ చంద్రకృష్ణ మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారి స్ఫూర్తితో మొదలైన నా జర్నీ ఇక్కడ వరకూ వచ్చింది.

‘΄పొట్టేల్‌’లో చాన్స్‌ ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘ఇటీవల ఏ సినిమాకీ ΄పొందని అనుభూతిని ప్రేక్షకులు మా ‘΄పొట్టేల్‌’తో ΄పొందుతారు’’ అని సాహిత్‌ చెప్పారు. ‘‘చదువు విలువ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో తీసిన సినిమా ఇది’’ అన్నారు సురేష్‌ కుమార్‌. ‘‘΄పొట్టేల్‌’ లాంటి సినిమా తీసిన నా ఫ్రెండ్‌ సాహిత్‌ పేరు చాలా కాలం గుర్తుండిపోతుంది’’ అన్నారు నిశాంక్‌ రెడ్డి.

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)