Breaking News

సీఎం సహాయ నిధికి సందీప్‌ రెడ్డి విరాళం.. వాళ్లపై విమర్శలు

Published on Fri, 08/29/2025 - 17:03

టాలీవుడ్‌ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిసి సీఎం సహాయక నిధికి  విరాళాన్ని అందించారు.  తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల  జన జీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా కామారెడ్డి సిద్దిపేట, సిరిసిల్ల, ములుగు, యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాలను సైతం  భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఇలాంటి సమయంలో తన వంతుగా సాయం చేసేందుకు దర్శకుడు సందీప్‌రెడ్డి ముందుకు రావాడాన్ని తన అభిమానులు సంతోషిస్తున్నారు.

సీఎం రేవంత్‌ రెడ్డిని సందీప్‌రెడ్డి వంగాతో పాటు తన సోదరుడు ప్రణయ్‌ రెడ్డి కలుసుకున్నారు. భద్రకాళి ప్రొడక్షన్స్ తరపున సీఎం సహాయక నిధికి రూ.10 లక్షల విరాళాన్ని అందించారు. రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన వారిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కుండపోతగా కురిసిన వర్షంతో కామారెడ్డి జిల్లా అతలాకుతలమైంది. కామారెడ్డి పట్టణం చిగురుటాకులా వణికిపోయింది. 

రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా టాలీవుడ్‌ నుంచి ఎవరూ స్పందించలేదు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటన జరిగితే కోట్ల రూపాయలు ఇచ్చే టాలీవుడ్‌ సెలబ్రిటీలు ఇప్పుడు తెలంగాణ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ బిడ్డలకు ఆపద వస్తే స్పందించరా అంటూ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. వరంగల్‌కు చెందిన సందీప్‌రెడ్డి వంగా చేసిన సాయంతో అయినా మరికొందరు ముందుకు వస్తారని నెటిజన్లు ఆశిస్తున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)